కొణిదెల ఇంటి పేరు ఎలా వచ్చిందంటే.. ఉద్వేగంగా చెప్పిన పవన్ కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈవెంట్ గురువారం (ఆగస్టు 21) సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేలాది మెగా ఫ్యాన్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొనగా.. అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, డా.కె.వెంకటేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు, అమెరికా ఎన్నారై.. మెగా బ్లడ్ డ్రైవ్ నిర్వాహకుడు నటరాజ్, కాసర్ల శ్యామ్, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
మా ఇంటి పేరు కొణిదెల. ఆ పేరు ఎలా వచ్చిందో మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి అడిగినా ఎవరూ చెప్పలేదు. కర్నూలులోని నందికొట్కూరులో కొణిదెల గ్రామం ఉంది. బహుశా అలా మా ఇంటి పేరు అలా వచ్చి ఉంటుందేమో అని సైరా కథ విన్న తర్వాత అర్ధమైంది.
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)
ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కర్నూలుకు సంబంధించిన రేనాడు ప్రాంతానికి చెందిన వీరుడు. నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటారు. అలాంటి రేనాడు పదాన్ని పలికే అదృష్టం సైరా నర్సింహరెడ్డి సినిమా నాకు ఇచ్చింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

సైరా సినిమా గురించి చెప్పాల్సి వస్తే.. ఓ కథ గుర్తుకు వస్తుంది. సింహాన్ని వేటాడిన విషయాన్ని వేటగాడికి చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా సింహమే తాను వేటాడిన కథను చెబితే ఎలా ఉంటుందో అలా సైరా ఉంటుంది. చరిత్ర మరిచిపోయింది. కానీ రేనాల, కొణిదెల ప్రాంతాలు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డిని మరిచిపోలేదు.
సిపాయి తిరుగబాటు కంటే ఎంతో ముందుగా తిరుగుబాటు చేసిన యోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి తిరిగిన ప్రాంతం కొణిదెలకు చెందిన కథను కొణిదెల కుటుంబం నిర్మించడం మరిచిపోలేని విషయం అని పవన్ అన్నారు.


Click it and Unblock the Notifications











