'మగధీర'ని తమిళ్ లో చేస్తే...పవన్ కామెంట్
మగధీర చిత్రాన్ని తమిళంలో చేస్తే గ్యారెంటీగా అది తెలుగులో బాగా ఆడి ఉండేది అన్నారు పవన్ కళ్యాణ్. తమిళంలోకి పంజాని డబ్బింగ్ చేస్తున్న సందర్భంలో ఆయన తమిళ డబ్బింగ్ ల విషయమై మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే.. నిర్మాతలు తమ చిత్రాల తమిళ రీమేక్ రైట్స్ ని అమ్మటం వల్లే తెలుగు హీరోల కి అక్కడ మార్కెట్ రావటం లేదని అన్నారు. రీమేక్ కాకుండా డబ్బింగ్ చేస్తే గ్యారెంటీగా అక్కడ తెలుగు హీరోలు సినిమాలు ఆడేవని,మార్కెట్ ఏర్పడేదని అన్నారు. తమిళ హీరోలు అదే పని చేస్తున్నారని, అందుకనే వారికి ఇక్కడ సైతం మార్కెట్ ఏర్పడిందని, మంచి సినిమాకి భాషా భేధం లేదని ఆయన అన్నారు.
గతంలోనూ శివ, అంకుశం, గీతాంజలి వంటి చిత్రాలు రీమేక్ చేయకండా డైరక్ట్ డబ్బింగ్ చేయటం వల్లే అక్కడ ఆడాయని గుర్తు చేసారు. ఈ విషయాన్ని తమిళ నిర్మాతలు,దర్శకులు, ముఖ్యంగా హీరోలు బాగా ఆర్దం చేసుకుని వారి సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారని గుర్తు చేసారు. వారు రీమేక్ రైట్స్ ఇవ్వకుండా ఇక్కడ మార్కెట్ ని కాప్చర్ చేయగలగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన తాజా చిత్రం పంజా విడుదల సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు మాట్లాడారు. పంజా చిత్రం ఈ నెల తొమ్మిదవ తేదిన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











