»   » పవన్ కళ్యాణ్ ‘మే డే’ శుభాకాంక్షలు

పవన్ కళ్యాణ్ ‘మే డే’ శుభాకాంక్షలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేడేను పురస్కరించుకుని ప్రకటన విడుదల చేసారు. కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు మరచి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక వేడుక మే డే ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan

ప్రతి ఇంట్లో నిత్యం శ్రమించే అమ్మ నుంచి సరిహద్దులో అహర్నిశలు దేశ రక్షణకు కాపలాకాసే సైనికుడి వరకు అంతా జరుపుకునే పండుగే మేడే అని ఆయన చెప్పుకొచ్చారు. మేడే అంటే శ్రమ శక్తికి తిరుగులేదని చాటే ఘనమైన రోజు అన్నారు.

ప్రతినిత్యం కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరూ సంతోషంగా జీవించాలని, వారి జీవితాలు మరింత సుఖమయం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ప్రపంచంలోని శ్రామికులందరికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున మే డే శుభాకాంక్షలు-జైహింద్' అని ప్రకటనలో తెలిపారు.

English summary
Pawan Kalyan sends May Day wishes to Telugu people and fans. Pawan Kalyan, is an Indian film actor, producer, director, screenwriter, writer, and politician. His film works are predominantly in Telugu cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu