నిహారిక పెళ్లి వెనుక పవన్ కళ్యాణ్ మాట.. ప్రేమలో ఉన్నారని తెలుసుకొని మెగాస్టార్ కూడా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నిహారిక పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా నిహారిక , చైతన్య పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లిపై రోజుకో రూమర్ ఒక స్పెషల్ బజ్ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న శుభకార్యం కావడంతో అందరి దృష్టిపై వారిపైనే పడింది. అయితే ఈ పెళ్లి వెనుక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ కూడా ఉన్నారని వివిధ రకాల స్టోరీలు వినబడుతున్నాయి..

గత ఏడాది నుంచే..
గుంటూరు జిల్లాకు చెందిన చైతన్య జొన్నలగడ్డ బిట్స్ పిలానిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చాలా కాలం నుంచి మెగా ఫ్యామిలీతో వీరికి సాన్నిహిత్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు IG ప్రభాకర్ రావ్ కొడుకు అని కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. గత ఏడాది నుంచి నిహారిక పెళ్లి చేయాలని మెగా బ్రదర్స్ ఆలోచిస్తున్నారట. ఫైనల్ గా నిహరికకు నచ్చినవాడు దొరకడంతో పెళ్లికి పనులు మొదలుపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ మాట..
సాధారణంగా మెగా ఫ్యామిలీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. అయితే నిహారిక పెళ్లి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ముందుగా ఈ ఆలోచనను లేవనెత్తినట్లు తెలుస్తోంది. చైతన్య గురించి అంధరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ స్టడీ చేసినట్లు సమాచారం.

మెగాస్టార్ కూడా..
ఇక అప్పటికే నాగబాబు కూడా ప్రభాకర్ రావ్ ఫ్యామిలీతో మంచి స్నేహ బంధం ఏర్పడడంతో పవన్ కళ్యాణ్ మాటతో నాగబాబు కూడా ఆలోచనలో పడ్డారట. ఇక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వద్ద విషయం గురించి చర్చించడంతో గత ఏడాదే ఒక నిర్ణయానికి వచ్చారట. చైతన్యకు నిహారికకు కరెక్ట్ సెట్టవుతుందని సమ్మర్ లోనే పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
Recommended Video

ప్రేమలో ఉన్నారని..
ఎక్కువగా వైరల్ అవుతున్న మరొక టాక్ ఏమిటంటే.. నిహారిక, చైతన్య 2017 నుంచే ప్రేమలో ఉన్నారని.. ఇరు కుటుంబాలకు ముందు నుంచే మంచి పరిచయాలు ఉండడం వలన మెగాస్టార్ చిరంజీవి వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వస్తోంది. ఏది ఏమైనా నిహారికకు మాత్రం డ్రీమ్ బాయ్ దొరికేశాడని ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











