twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయపడితే ఈ దరిద్రపు హీరోగిరి ఎందుకు? అందుకే కొట్టాను: పవన్ కళ్యాణ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Pawan Kalyan Talks About Some Incidents At Movie Spots

    పవన్ కళ్యాణ్ షూటింగులో ఉన్నాడంటే అక్కడ వాతావరణం అంతా స్ట్రిక్ట్‌గా ఉంటుందని, ఏదైనా తప్పు చేయడానికి బయపడతారు అని చెబుతుంటారు. అందుకు కారణం పవన్ కళ్యాణ్ కోపమే. ఆయన ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే అస్సలు సహింరని, అక్కడే చెంప వాయించేస్తాడు అనే పేరు ఉంది. ఇటీవల ఓ కాలజీ మీటింగులో ఇందుకు సంబంధించి విషయాలను పవర్ స్టార్ గుర్తు చేసుకున్నారు. అమ్మాయిలను రక్షించడానికి నిర్భయ లాంటి చాలా చట్టాలు ఉన్నాయి. కానీ ఇన్ని ఉన్నా, ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్నా అమ్మాయిల మీద అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పంజా, తమ్ముడు షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.

    పంజా షూటింగ్ సమయంలో

    పంజా షూటింగ్ సమయంలో

    నేను గతంలో ‘పంజా' షూటింగ్ కోసం కేరళ వెళ్లాను. నాతో పాటు బ్యాగ్రౌండ్‌లో చాలా మంది అమ్మాయిలు యాక్ట్ చేస్తున్నారు. అక్కడికి ఒక సమూహం వచ్చింది. వారు అమ్మాయిల దగ్గరకు వచ్చి వారిని ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఓ వైపు పోలీసులు ఉన్నారు, అందరూ చూస్తూ ఉండగానే.... వారిని భయపట్టేస్తున్నారు. అది సహించలేక వారిని కొట్టేశాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

     అందుకే కొడతాను..

    అందుకే కొడతాను..

    అలాంటి సంఘటనలు చాలా షూటింగుల్లో జరిగాయి. నేను చాలా సార్లు షూటింగుల్లో ఎందుకు కొడతాను అంటే... అపుడు పోలీసులను పిలిచే సమయం ఉండదు. అప్పటికప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆ పని చేయక తప్పేది కాదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    తమ్ముడు షూటింగులో చెట్టుకు కట్టేసి

    తమ్ముడు షూటింగులో చెట్టుకు కట్టేసి

    తమ్ముడు షూటింగ్ చేస్తున్నపుడు కూడా హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒకడు ఇబ్బంది పెట్టాడు. పక్కకు వెళ్లు షూటింగ్ చేసుకోవాలంటే వాడు వినలేదు. లాగి ఒక్కటి కొట్టాను. అపుడు అందరూ వాడిని చెట్టుకు కట్టేసి కొట్టారు.

    ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే...

    ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే...

    ఎందుకు ఇలాంటివి జరుగుతాయి అంటే... ఎన్ని చట్టాలు ఉన్నా, ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా సమాజం మేల్కోక పోతే ఏమీ చేయలేం. ఆ రోజు నేను అలా చేసి ఉండకపోతే నా షూటింగుకు వచ్చే ప్రతి ఆడపిల్ల అభద్రతా భావానికి గురవుతుంది.

     భయపడితే ఈ దరిద్రపు హీరోగిరి ఎందుకు?

    భయపడితే ఈ దరిద్రపు హీరోగిరి ఎందుకు?

    నేను సినిమాల్లో 20 మందిని కొట్టి... రియల్ లైఫ్‌లో ఒకడిని పక్కకు వెళ్లు అనడానికి భయపడితే ప్రయోజనం ఏమిటి, ఆ దరిద్రపు హీరోగిరి దేనికీ అనుకుంటాను. అలాంటి జీవితం దేనికి అనిపిస్తుంది.

     చావగొడతారు అనే భయం ఉండాలి

    చావగొడతారు అనే భయం ఉండాలి

    చిన్నతనంలో మా అక్క, చెల్లి ఇలాంటి సమస్యలతోనే బాధపడటం చూసేవాడిని. ఇంత మంది ఉండగా ఒకడు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఎవడూ మాట్లాడటం లేదు అనుకునే వాడిని. సమాజంలో మార్పులు కేవలం చట్టాల ద్వారా మాత్రమే రావు. ఒక ఆడపిల్లను ఒకడు ఏడిపిస్తుంటే సమాజంలోని వ్యక్తులు చావగొట్టేస్తారు అనే భయం ఉంటే తప్ప కొందరు మాట వినరు. ఎవరైనా ఆడపిల్ల బయటకు వెళితే ఏడిపిస్తున్నారంటే తప్పు సమాజానిది కూడా, కేవలం పోలీసులనే తప్పుబట్టడం సరికాదు అని పవన్ కళ్యాన్ అభిప్రాయ పడ్డారు.

    English summary
    Pawan Kalyan about Panja, Thammudu movie incidents. Pawan said, I slapped some bad boys who are troubling the girls on the sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X