ఆ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాను.. రజనీకాంత్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్

రజనీ కాంత్ ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను మాత్రమే కాకుండా సినీ సెలెబ్రిటీలందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నెగెటివ్ అని తేలడం, రక్తపోటు తప్పా మిగతా ఆరోగ్య సమస్యలేమీ లేవని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను జారీ చేశాడు. రజనీకాంత్ ఆరోగ్యం పట్ల స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

Recommended Video

Rajinikanth Hospitalised In Hyderabad Appollo Hospital | Rajini Health Update | Filmibeat Telugu
షూటింగ్ కారణంగానే...

షూటింగ్ కారణంగానే...

రజనీకాంత్ అన్నాత్తె షూటింగ్‌లో భాగంగా హైద్రాబాద్‌కు వచ్చారు. డిసెంబర్ 15 నుంచి అన్నాత్తె షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతూ వచ్చింది. అయితే అన్నాత్తె యూనిట్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో దాదాపు ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అందరిలోనూ అందోళనలు రేకెత్తాయి. కానీ రజనీకాంత్‌కు మాత్రం నెగెటివ్ అనే వచ్చింది. అప్పటి నుంచి రజనీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

రక్తపోటు సమస్యలు..

రక్తపోటు సమస్యలు..

రజనీకాంత్ ఈ రోజు ఉదయం హాస్పిటల్‌లొ జాయిన్ అయ్యారని కరోనా లక్షణాలేవీ లేకపోయినా కూడా బీపీ ఫ్లక్ఛువేట్ అవుతోందని వైద్యులు ప్రకటించారు. ఆ ఒక్క సమస్య తప్పా రజనీకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది.

 పవన్ కళ్యాణ్ స్పందన..

పవన్ కళ్యాణ్ స్పందన..

రజనీ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రముఖ కథానాయకులు రజనీకాంత్ గారు అస్వస్థతతో హైద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చేరినట్టు తెలిసి బాధపడ్డాను. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనో ధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని కోరారు.

బాబాజీ ఆశీస్సులు..

బాబాజీ ఆశీస్సులు..

ఆధ్యాత్మిక పరులైన రజనీకాంత్‌కు భగవదనుగ్రహం కలగాలి. ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను జారీ చేశారు.

షూటింగ్ వాయిదా..

షూటింగ్ వాయిదా..

ఇక అన్నాత్తె షూటింగ్ మొత్తం వాయిదా పడింది. ఒకే సారి ఆరుగురికి పైగా కరోనా పాజిటివ్ అని రావడం, ఇప్పుడు ఇలా రజనీ ఆస్పత్రి పాలవ్వడంతో అన్నాత్తె షూటింగ్ మొత్తానికి క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. మళ్లీ జనవరిలోనే షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X