అయోధ్యలో మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రతిష్ట.. అపూర్వ ఘట్టం గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంతో అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది. అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు లామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ పూజలో ప్రధాని నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో అయోధ్య నగరం రామనామ స్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక ఆరంభానికి ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం పవన్ కల్యాణ్ వాహనంలో వెళ్తూ కనిపించారు. హనుమాన్ జపానికి సంబంధించిన పాటలు వింటూ అయోధ్యకు సాగిపోయారు.

అంతకుముందు లక్నో విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ నాగరికతకు రామచంద్ర ప్రభువు మూల కారకుడు. అయోధ్యకు రాముడిని తీసుకు రావడానికి 500 సంవత్సరాుల పట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతీ భారతీయుడి కల. ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా, భావోద్వేగంగా ఉంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేఖ, అభిషేక్ అగర్వాల్ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి అభిషేక్, అమితాబ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, వికీ కౌశల్, కత్రినా కైఫ్, కంగన రనౌత్ తదితరులు హజరయ్యారు.


Click it and Unblock the Notifications











