సత్యాగ్రహి మూవీని అందుకే ఆపేశాను.. అందరూ తిట్టారు.. సిక్స్‌ప్యాక్ కాదు.. పవన్ కల్యాణ్

Recommended Video

Pawan Kalyan At Janasena Pravasa Garjana : Pawan Is A Real Satyagrahi! | Filmibeat Telugu

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్‌లోని ఎన్నారైలతో కలిసి ప్రవాసాంధ్ర గర్జన అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ కోసం విరాళాల సేకరణకు రాలేదు. విరాళాలు సేకరించడం నాకు ఇష్టం ఉండదు అని స్పష్టం చేశారు. డల్లాస్‌లో జరిగిన కార్యక్రమానికి యువతీ, యువకులు పోటెత్తారు పార్టీ నాయకుడు నాదేండ్ల మనోహర్‌తో కలిసి ఆ సభలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

భయపడే పనిని చేస్తాను

భయపడే పనిని చేస్తాను

నా జీవితంలో ప్రతీ రోజు నేను భయపడే పనిని చేస్తాను. నాకు భయాన్ని కలిగించే అంశంపై అధిపత్యం కొనసాగించాలని కోరుకొంటాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేనికైతే భయపడుతానో.. దానిని తప్పకుండా చేస్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

గుండె ధైర్యాన్ని పెంచడానికి

గుండె ధైర్యాన్ని పెంచడానికి

యువతలో కొంత మంది సిక్స్ ప్యాక్, యయిట్ ప్యాక్ కోసం శ్రమిస్తారు. కానీ నేను ధైర్యం అనే బలం కోసం పనిచేస్తాను. కండలు పెంచడం చాలా ఈజీ. కానీ గుండె ధైర్యాన్ని పెంచాలంటే పిరికితనాన్ని జయించాలి. రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే చాలా గుండె ధైర్యం కావాలి.

ప్రజా సమస్యలను తీర్చడానికే

ప్రజా సమస్యలను తీర్చడానికే

భవిష్యత్ మీద భయం ఉండటం చాలా సహజం. ప్రజల సమస్యలను తీర్చాలంటే ధైర్యమనే గాండీవాన్ని ధరించాలని నాకు ఇష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన మాటలు నాకు ఇష్టం. అనేక సభల్లో ఆవేశంగా మాట్లాడినట్టు నేను మాట్లాడను. నా ఆలోచనలు, ఆశయాలను వెల్లడించడానికే వచ్చాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

సత్యాగ్రహి అందుకే ఆపేశాను

సత్యాగ్రహి అందుకే ఆపేశాను

చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమాను స్టార్ట్ చేసి ఆపేశాను. ప్రస్తుతం నేను నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే సత్యాగ్రహి సినిమా కథ. సినిమాల్లో పోరాటం చేస్తే పనులు జరగడం కష్టం. నిజ జీవితంలో నేను పోరాటం చేయడానికి సత్యాగ్రహి సినిమాను ఆపేశాను.

సినిమాలతో పోరాటం చేయడం

సత్యగ్రహి సినిమాను ఆపేసినప్పుడు చాలా మంది నన్ను తిట్టారు. సత్యాగ్రహి సినిమా పోస్టర్‌లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఫొటోను, చే గువేరా ఫొటోను పెట్టాను. సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలతో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకోవడమే సత్యాగ్రహి సినిమా ఆపడానికి కారణం అని పవన్ కల్యాణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X