twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తొలి సినిమా అదికాదు: షాకింగ్ విషయం చెప్పిన పవన్ కళ్యాణ్!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగానికి పరిచయం అయిన తొలి సినిమా ఏదంటే ‘అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి’ అని అంతా ఇట్టే చెప్పేస్తారు. కానీ తన తొలి సినిమా ఇది కాదని, కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ మూవ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగానికి పరిచయం అయిన తొలి సినిమా ఏదంటే 'అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి' అని అంతా ఇట్టే చెప్పేస్తారు. ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయిన తొలి అదే అని అంతా ఇప్పటి వరకు భావించారు.

    అయితే ఆయన తొలి చిత్రం ఇది కాదని.... కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శుభలేఖ' సినిమా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఈ విషయం తాజాగా పవన్ కళ్యాణ్ బయట పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

    కె. విశ్వనాథ్ తో అనుబంధం గుర్తు చేసుకుంటూ..

    కె. విశ్వనాథ్ తో అనుబంధం గుర్తు చేసుకుంటూ..

    ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ దాదా ఫాల్కే అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ విషయం చెప్పుకొచ్చారు. ను సినీ రంగంలో తొలి అడుగు వేసిందీ, తొలి పలుకు వేసిందీ ఆయన సినిమాలోనే అని తెలిపారు.

    మద్రాసులో ఉండగా అనుకోకుండా

    మద్రాసులో ఉండగా అనుకోకుండా

    మద్రాసు టీ నగర్‌, పోరూరు సోమసుందరం వీధిలో అన్నయ్య వాళ్ల ఇల్లు ఉండేదని, దానికి ఎదురుగానే విజయనిర్మల గారి ఇల్లు ఉండేది. ఆ పక్క సందులోనే వాళ్ల డబ్బింగ్‌ థియేటర్‌ ఉంది. అందులో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అన్నయ్య తొలిసారిగా నటించిన 'శుభలేఖ' సినిమా డబ్బింగ్‌ జరుగుతుండగా వెళ్లి కలవగా అనుకోకుండా ఆ సినిమాతోనే నా ఎంట్రీ జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    అప్పుడు నా వయసు 16

    అప్పుడు నా వయసు 16

    ఆ సమయంలో నా వయసు 16. చదువుకుంటున్నా. ఇంటి పక్కనే కదా అని అన్నయ్యకు టీ ఇవ్వడానికి డబ్బింగ్‌ థియేటర్‌ కి వెళ్లాను. ఆ సినిమాలో అన్నయ్య సర్వర్‌ గా పనిచేసే పాత్రలో నటించారు. ఏదో హోటల్‌ సీన్ కు డబ్బింగ్ జరుగుతూ ఉన్న సమయంలో నేను వెళ్లాను. నన్ను చూసిన, ఆ సినిమా నిర్మాత వి.వి.శాస్త్రి నాతో డబ్బింగ్ చెప్పించారని తెలిపారు.

    ఆ డైలాగుతో ఎంట్రీ

    ఆ డైలాగుతో ఎంట్రీ

    ‘‘మంచినీళ్ళు ఎక్కడ సార్‌?' అనే చిన్న డైలాగ్‌ నాతో చెప్పించారు. ఇప్పటికీ 'శుభలేఖ' సినిమాలో నా గొంతులో ఆ డైలాగ్‌ వినచ్చు. అదే నా తొలి పరిచయం. ఒక రకంగా చెప్పాలంటే, విశ్వనాథ్‌ గారి సినిమాతోనే నా రంగప్రవేశం జరిగిందనుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    English summary
    Pawan Kalyan said that, he is started his movie career with K Vishwanath's Shubhalekha movie as a dubbing artist.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X