నేను చేయలేనిది రాంచరణ్.. దశాబ్దాలుగా చేయలేనిది చిరంజీవికే సాధ్యం: పవన్ కల్యాణ్

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈవెంట్ గురువారం (ఆగస్టు 21) సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో వేలాది మెగా ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన‌గా.. అల్లు అర‌వింద్, సాయి ధ‌ర‌మ్ తేజ్, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు, మెగాస్టార్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు, అమెరికా ఎన్నారై.. మెగా బ్ల‌డ్ డ్రైవ్ నిర్వాహ‌కుడు న‌ట‌రాజ్, కాస‌ర్ల శ్యామ్, గాయ‌ని మంగ్లీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

మన నేల కోసం ప్రాణత్యాగం

మన నేల కోసం ప్రాణత్యాగం

అన్నయ్య చిరంజీవి ఎలాంటి సినిమాలో నటిస్తే చూడాలని ఉందో.. అలాంటి సినిమా సైరా నర్సింహారెడ్డి. మన నేల కోసం ప్రాణా త్యాగం చేసిన స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని, అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు చిరంజీవి గారు అత్యున్నత ప్రమాణాలతో రూపొందించడం చాలా సంతోషంగా ఉంది.

 కథనే చిరంజీవిని వెతుక్కొంటూ

కథనే చిరంజీవిని వెతుక్కొంటూ

సైరా సినిమా చిరంజీవి వెతుక్కొని తెచ్చుకొన్నది కాదు. మెగాస్టార్‌ను వెత్కుకొని సైరా కథ వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి అని చెప్పింది. నీవైతేనే కథకు, సినిమాకు న్యాయం జరుగుతుందని భావించింది. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రానికి నిర్మాత ఎవరినో ఎంచుకోలేదు. కొణిదెల వంశానికి చెందిన రాంచరణ్‌నే నిర్మాతగా మార్చింది.

 చిరంజీవిని అలా చూడాలన్న కోరిక

చిరంజీవిని అలా చూడాలన్న కోరిక

చరిత్రను తిరగరాసే బలమున్న సినిమాలో చిరంజీవిని చూడాలనే కోరిక ఉంది. కానీ అలాంటి సినిమాను నిర్మించాలనే ఆలోచన నాకు రాలేదు. అయితే తమ్ముడిగా కలలుకొన్నాను కానీ చేయలేకపోయాను. అయితే రాంచరణ్ నిర్మిస్తున్నాడని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. సైరా లాంటి గొప్ప సినిమాను నిర్మించే శక్తి, సామర్థ్యాలు నాకు లేవు. కానీ నా తమ్ముడి లాంటి రాంచరణ్ రూపొందించడం గర్వంగా ఉంది.

తండ్రినే పరిచయం చేసిన కొడుకు

తండ్రినే పరిచయం చేసిన కొడుకు

సాధారణంగా సినీ పరిశ్రమలో వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం ఆనవాయితీ ఉంది. కానీ తండ్రిని మళ్లీ సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత రాంచరణ్‌కే దక్కింది. ఖైదీ నంబర్ 150 ద్వారా చిరంజీవిని మళ్లీ సినిమాల్లోకి తెచ్చారు. అలాగే చరిత్ర మరిచిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథతో మళ్లీ దేశ సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నారు.

 చిరంజీవి, రాంచరణ్‌కే సాధ్యం

చిరంజీవి, రాంచరణ్‌కే సాధ్యం

ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి సినిమాను తెరకెక్కించాలని ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్య పడలేదు. కానీ రాంచరణ్ మాత్రమే ఆ ధైర్యాన్ని చేశాడు. సైరా లాంటి సినిమాను చిరంజీవి మాత్రమే చేయాలి.. రాంచరణ్ లాంటి వ్యక్తి తీయాలి. వందల కోట్లు ఖర్చైనప్పటికీ.. రాంచరణ్ వెనుకాడలేదు. డబ్బులు వస్తాయో రావో అని ఆలోచించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X