తెగించిన పవన్ , త్రివిక్రమ్‌కు ప్రమాదమనే అలా?
హైదరాబాద్ : సినిమా హీరోగా నెం.1 స్థానంలో ఉన్న సమయంలో కూడా అన్నింటికీ తెగించి వచ్చానని, కుటుంబం, పిల్లలు, నా వాళ్ల కంటే.....ఈ సమాజం, దేశం గొప్పదనే భావనతోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇంతకాలం పవన్ కళ్యాణ్ వెనక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిదే.
అసలు పవన్ కళ్యాణ్ మీటింగుకు కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం కూడా త్రివిక్రమే అనే ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో ఈ వార్తలకు తెర దించారు. తాను రాజకీయాల్లోకి రావడం తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అసలు ఇష్టం లేదని, ఆయనతో పాటు చాలా మంది నన్ను రాజకీయాల్లోకి వెళ్లొద్దని చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అయితే పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఒక విషయం స్పష్టం అవుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రంగంలో ఎంతో భవిష్యత్ ఉన్న వ్యక్తి. తన రాజకీయాల కోసం ఆయన కెరీర్ ప్రమాదంలో పడకూడదనే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడినట్లు చెబుతున్నారు.
త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తేనే...ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా 'అత్తారింటికి దారేది'. ఇటీవలే ఆ చిత్రం విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. త్వరలో ఆయన అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











