twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చంపుతానేమో అనుకున్నారు: అమెరికా సంఘటన గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్!

    |

    Recommended Video

    Pawan kalyan Shares An Incident That He Faced In America

    పవర్ స్టార్‌ను అలా పిలవడం ఇపుడు సరైంది కాదేమో! ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ జనసేన అధినేత హోదాలో రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తన పొలిటికల్ టూర్లో భాగంగా మంగళవారం కాకినాడ వెళ్లిన పవన్ కళ్యాణ్ ముస్లిం కమ్యూనిటీతో సమావేశం అయ్యారు.

    తమ్ముడు కోసం మెగాస్టార్ గెస్ట్ రోల్.. పంచెకట్టుతో పవన్, చిరు.. మెగా హీరోల ఫొటో వైరల్!తమ్ముడు కోసం మెగాస్టార్ గెస్ట్ రోల్.. పంచెకట్టుతో పవన్, చిరు.. మెగా హీరోల ఫొటో వైరల్!

    ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. అమెరికాలో 2001, సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ సంఘటన సమయంలో కొందరు నన్ను చూసి ముస్లిం అని పొరబడ్డారని, నేను వారిని చంపేస్తానేమో అని భయపడ్డారని తెలిపారు.

    ముస్లిం ఎదుర్కొంటున్న సమస్య అర్థమైంది

    ముస్లిం ఎదుర్కొంటున్న సమస్య అర్థమైంది

    అమెరికాలో సెప్టెంబర్ 11, ట్విన్ టవర్స్ బ్లాస్ట్ జరిగినపుడు నేను అమెరికాలోనే ఉన్నాను. అపుడు నాకు బాగా గడ్డం ఉండటంతో నా అవతారం చూసి ఓ అమెరికన్ నన్ను ముస్లిం అని భావించారు. నేను వారిని చంపేస్తానేమో అని భయపడ్డారు. ఆ పరిస్థితితో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్య నాకు అర్థమైంది... అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

    ప్రతి మతంలో అలాంటి వారు ఉంటారు

    ప్రతి మతంలో అలాంటి వారు ఉంటారు

    చెడ్డ వ్యక్తులు ప్రతి మతంలోనూ ఉంటారని, అయితే కొన్ని సంఘటనల ఆధారంగా ఒక మతానికి చెందిన అందరినీ టెర్రరిస్టులుగా భావించడం సరికాదు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు.

    కేవలం ఓటు బ్యాకుంగానే

    కేవలం ఓటు బ్యాకుంగానే

    ప్రభుత్వం ముస్లింల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని, మైనారిటీల పేరుతో వారిని కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారని... ఇలాంటి పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీపై, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేశారు.

    సినిమాల్లో రీ ఎంట్రీ ఎప్పుడు?

    సినిమాల్లో రీ ఎంట్రీ ఎప్పుడు?

    ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమైన పవన్ కళ్యాణ్ 2019 ఏపీ ఎన్నికల తర్వాత ఎదురయ్యే పరిస్థితులను బట్టి మళ్లీ సినిమాల్లో నటించడమా? లేక రాజకీయాల్లో కంటిన్యూ అవ్వడమా? అనేది తేలనుంది. ప్రస్తుతం పవర్ స్టార్ తన ఫోకస్ అంతా ప్రజా సమస్యలపైనే పెట్టారు.

    English summary
    "I was in America when the tragic incident of Twin Towers blast happened. One of the Americans asked me if I were a Muslim looking at my bearded attire. She asked me if I was going to kill them. " Pawan Kalyan told addressing the community people Kakinada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X