twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత భయంకరమో మీకే తెలుస్తుంది.. రక్షణ కల్పించండి.. పవన్ కల్యాణ్

    |

    నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సినీ, రాజకీయ, సామాజిక మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మంగళవారం అఖిల పక్ష పార్టీల నేతల సమావేశం జరిగింది. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ చీఫ్ జస్టిస్ పద్మనాభయ్య తదితర రాజకీయ, సామాజిక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం సోషల్ మీడియలో పవన్ ఘాటుగా స్పందించారు. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే..

    గిరిజనులకు ప్రజాస్వామ్యం గురించా?

    కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్‌లో తెలిపిన ప్రకారం.. ఆదీవాసీలకు ప్రజాస్వామ్యం గురించి బోధించాల్సిన అవసరం లేదు. అంతే కాదు మీరు గిరిజనులకు ప్రజాస్వామ్యం గురించి బోధించలేరు. మారి నుంచి ప్రజాస్వామ్య విధానాలను నేర్చుకోవాలి. ఈ భూమ్మీద ప్రజాస్వామ విధానాలు పాటించే వారెవరైనా ఉన్నారా అంటే అది ఆదివాసీలే అని పవన్ కల్యాణ్ అన్నారు.

    రక్షణ చర్యలు అవసరం లేదు..

    పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నిర్దేశించిన ప్రకారం.. మా ప్రజలకు ఎలాంటి రక్షణ చర్యలు అవసరం లేదు. మీ మినిస్టర్ల నుంచి కేవలం రక్షణ కావాల్సిందే. మాకు ఎలాంటి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అవసరం లేదు. మమ్మల్ని భారతీయులుగా పరిగణించండి అంటూ బీహార్‌కు చెందిన ఆదివాసీ జైపాల్ సింగ్ చెప్పిన విషయాన్ని పట్టించుకోండి అంటూ పవన్ కల్యాణ్ మరో ట్వీట్‌లో వెల్లడించారు.

    భారతీయులుగా ట్రీట్ చేయండి

    తోటి భారతీయుల మాదిరిగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారా? అని అఖిలపక్ష సమావేశంలో చెంచు నాయకుడు మల్లికార్జున్ నిలదీసిన వీడియోను పవన్ కల్యాణ్ ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో మల్లికార్జున్ ఆవేదన అందర్నీ ఆకట్టుకొన్నది.

    యురేనియం ప్రాజెక్టుపై పుస్తకం

    నల్లమలలో ప్రజల జీవన విధానం, అక్కడి పరిస్థితుల తీవ్రత తెలిపే ఓ పుస్తకాన్ని అఖిల పక్ష సమావేశంలో ఆవిష్కరించాం. అందులో యురేనియం ప్రాజెక్టుపై జరుగుతున్న ఉద్యమకారులు తెలిపిన చాలా విషయాలు అందులో పొందుపరిచారు. నల్లమల్ల అడవుల్లో యురేనియం మైనింగ్ వల్ల పర్యావరణం, మానవాళిపై పడే ప్రభావం ఎంత భయంకరమో మీకే తెలుస్తుంది అని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Pawan Kalyan about Nallamala Uranium mining Project. He said, An excerpt from ‘constituent assembly debates’ ,Vol 1. Page 143.There is no need to teach democracy to adivasis. You cannot teach democracy to tribal people;you have to learn democratic ways from them. They are the most democratic people on Earth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X