అలా అయితే ప్రాజెక్ట్‌లన్నీ అటకెక్కినట్టే!!.. సినిమాలపై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడని తెలియడంతో ఫ్యాన్స్ ఎంత సంబరపడ్డారో అందరికీ తెలిసిందే. మొదటి రోజు లీకైన ఓ పిక్‌ను జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. ఏకంగా టీ షర్టులపై వేసి అమ్మితే క్షణాల్లో లక్షల స్టాక్ అయిపోయింది. అదీ పవన్ కళ్యాణ్ రేంజ్. అంతలా హైప్ పెంచిన వకీల్ సాబ్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు ఫ్యాన్స్. కానీ కరోనా వైరస్ వచ్చి వారి కలలను కాటు వేసింది.

షూటింగ్‌లన్నీ బంద్..

షూటింగ్‌లన్నీ బంద్..

కరోనా విజృంభణకు సినిమా పరిశ్రమ మొత్తం మూతపడింది. దీంతో దాదాపు మూడు నెలల పాటు షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. అయితే ఎంత కాలం ఇలా ఉండాలని సినీ పెద్దలందరూ ప్రభుత్వాలతో కలిసి చర్చించారు. షూటింగ్‌లు చేసుకోవడానికి అనుమతులు తీసుకున్నారు.

షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న స్టార్స్..

షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న స్టార్స్..

షూటింగ్స్ అనుమతి ఇచ్చిన తరువాత కూడా పెద్దవారు ఎవ్వరూ కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. కేవలం టీవీ రంగానికి చెందిన వారు మాత్రమే షూటింగ్‌లు జరుపుకుంటున్నారు. స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా షూటింగ్, సెట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడటం లేదు.

 పెండింగ్‌లో ప్రాజెక్ట్‌లు..

పెండింగ్‌లో ప్రాజెక్ట్‌లు..

ఇక పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే.. వకీల్ సాబ్ కొంత పార్ట్ మిగిలపోయింది. క్రిష్ ప్రాజెక్ట్ మొదలవ్వాల్సి ఉన్నా.. అది ఇప్పట్లో సాధ్యం మయ్యేలా కనిపించడమే లేదు. పైగా చారిత్రాత్మక చిత్రం, వందలు వేల సంఖ్యలో జనాలు కావాల్సి ఉంటుంది. ఇటు వకీల్ సాబ్, అటు క్రిష్ ప్రాజెక్ట్‌లే తేలడం లేదు.. ఇక హరీష్ శంకర్-మైత్రీ మూవీస్ ఊసే కనబడటం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

Recommended Video

PARANNAGEEVI Official Trailer | RGV | Shakalaka Shankar
వ్యాక్సిన్ వచ్చే వరకు..

వ్యాక్సిన్ వచ్చే వరకు..

పవన్ కళ్యాణ్ తన ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవని చెప్పుకొచ్చాడ. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చిందని, ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందేనని తెలిపాడు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందేనని తెలిపాడు. ఈ లెక్కన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో.. షూటింగ్‌లు ఎప్పుడు మొదలు పెడతారో, ఆ ప్రాజెక్ట్‌లు ఉంటాయో అటకెక్కుతాయో ఆ దేవుడికే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X