»   » ఉమెన్స్ డే: మాటల్లో కాదు, చేతల్లో చేద్దామంటున్న పవన్ కళ్యాణ్

ఉమెన్స్ డే: మాటల్లో కాదు, చేతల్లో చేద్దామంటున్న పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటుడు, జనసన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అపీషియల్ గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఎక్కడ దేవతలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వస్తుందన్న బాపు మాటలను నిజం చేద్దామని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Pawan Kalyan about Womens Day

పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్

'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత' అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని మన పూర్వీకులు చెబుతుండేవారు. ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో వారికి పూజలు చేయలేకపోయినా వారేమి బాధపడరు. వారు ఎప్పుడు బాధపడతారంటే వారికి కనీస గౌరవం ఇవ్వనపుడు, సమాన అవకాశాలు కల్పించలేనపుడు, నిర్భంగా తిరగలేనప్పుడు మన ఆడపడుచులు తీవ్రంగా వ్యధ చెందుతారు. ఒకప్పుడు భారతీయ సమాజంలో స్త్రీకి ఎంతో విలువ ఉండేది. అది క్రమ క్రమంగా క్షీణించిపోయింది. ఈ ప్రాభవాన్ని మళ్ళీ మనందరం పునర్జీవింపచేద్దాం. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని బాపు అన్న మాటలను నిజం చేద్దాం. మహిళ దినోత్సవాలను మాటలతో చేయడం కాదు. చేతల్లో చూపుదాం. మన ఆడపడుచులు తలెత్తుకుని బ్రతికేలా వారికి సమాన అవకాశాలు కల్పిద్దాం. ఎన్నో సంవత్సరాలుగా పార్లమెంటును దాటి బయటకు రాని మహిళా బిల్లుకు మోక్షం కల్పిద్దాం. భ్రూణ హత్యలను అరికట్టి ఆడబిడ్డలను సంరక్షించుకున్నపుడే భారత జాతి సుసంపన్నంగా శోభిల్లుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ, విదేశాల్లోని సోదరీమణులు అందరికీ నా తరుపున, జనసేన పార్టీ తరుపున సోదరపూర్వక సోదర పూర్వక శుభాకాంక్షలు.

English summary
Tollywood power star and Janasena party president Pawan kalyan released a press note about Womens Day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu