రాజు సుందరం డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్..!?
ప్రస్తుతం 'షాడో' సినిమా షూటింగులో కోల్ కతాలో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ దీని తర్వాత, హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'గబ్బర్ సింగ్' సినిమా చేయాల్సి వుంది. హిందీ హిట్ సినిమా 'దబాంగ్' ఆధారంగా రూపొందే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంచితే, తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమాను ఓకే చేసినట్టు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ సుందరం మాస్టర్ తనయుడు, ప్రభుదేవా సోదరుడు అయిన రాజు సుందరం చెప్పిన కథ పవన్ కు ఎంతగానో నచ్చిందనీ, అతని డైరెక్షన్ లో చేయడానికి యాక్సప్ట్ చేశాడనీ అంటున్నారు. రాజు సుందరం గతంలో అజిత్, నయనతార జంటగా నటించిన 'ఏగన్' (తెలుగులో 'మల్లిక'గా డబ్ అయింది) చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు పవన్ తో రాజు సుందరం చేసే చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మిస్తాడు.
More from Filmibeat
pawan kalyan raju sundaram prabhu deva sundaram shadow పవన్ కళ్యాణ్ రాజు సుందరం పభ్రుదేవా సుందరం షాడో


Click it and Unblock the Notifications











