పవన్ చిత్రంలో ఆంగ్లో ఇండియన్ పాత్ర
పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో ప్రిన్స్ ఆప్ పీస్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మేరీ మాతగా ఓ ఆంగ్లో ఇండియన్ ని ఎంపిక చేసారు. పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో కేవలం ఇరవై నిముషాలే ఉండనుంది. ఇక త్వరలోనే ఆ ఫారిన్ అమ్మాయికీ, పవన్ కీ మధ్య జరిగే సీన్స్ షూటింగ్ జరగనుంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఆర్కిటెక్ గా కనిపించి అలరించనున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది.
ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్ ఇజ్రాయెల్ లోని జెరూసలేంలో జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన అనూష్క కనిపిస్తోంది. జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు గత రెండేళ్ల నుంచి ఈ చిత్ర కథను తయారుచేసారు. ఇక ఈ చిత్రంలో బాలలు ప్రధాన పాత్ర పోషిస్తారు. బాల రామాయణం, బాల భారతం తరహాలో ఇది బాలలతో రూపొందింస్తున్న క్త్రీస్తు చరిత్ర.


Click it and Unblock the Notifications











