అఙ్ఞాతవాసి ఫొటోలు లీక్: నెట్‌లో పవన్ కళ్యాణ్, అను ఇమ్మన్యుయేల్ ఫొటోలు
Recommended Video

పెద్ద సినిమా మొదలయ్యిందీ అంటేనే రకరకాల సమస్యలుంతాయి. సెట్టింగులూ, లొకేషన్లూ, స్టార్ హీరోలూ హీరోల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులూ లాంటివి చాలా కామన్ విషయాలు. కానీ రెండూ మూడేళ్లలో టెక్నాలజీ పెరగటం వల్ల ఇంకో పెద్ద సమస్య వచ్చిపడింది. అదే సినిమా లీకులు, పైరసీ అటు షూటింగ్ జరుగుతూంటేనే ఇటు లీకువీరులు రంగం లోకి దిగి పోతున్నారు. వీళ్ల చేతిలో ఉండే శక్తివంతమైన ఆయుధం స్మార్ట్ ఫోన్.. అది చేతిలో ఉంటే చాలు.

ఎంత జాగ్రత్త తీసుకున్నా
జనాలను థ్రిల్ చేసేందుకు, సినిమా పట్ల ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడకుండా ఉండేందుకూ, సినిమా మీద కొన్ని అంచనాలని అలాగే ఉంచటానికీ, పెంచటానికి ఈ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తూంటారు. అయితే ఇంత జాగ్రత్త తీసుకున్నా అక్కడ "క్రూ" లో ఉండే ఎవరో ఒకరు సింపుల్ గా మొబైల్ ఫోన్‌తో షూట్ చేసిపారేసి ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు.

అత్తారింటికి దారేది
గతం లో కూడా అత్తారింటికి దారేది సినిమాని సగానికి పైగా రిలీజ్ కి ముందే ఆన్లైన్ లో పెట్టిన అనుభవం ఉండనే ఉంది పవన్ కి... ఇప్పుడు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా "అఙ్ఞాతవాసి" సెట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. మరీ వీటివల్ల నష్టం ఏమీ లేదు గానీ అజాగ్రత్తని మాత్రం బయట పెట్టాయి. ఇదే అజాగ్రత్త ఏదైనా కీలక సన్నివేశం తీసేటప్పుడు చూపిస్తే??

కొన్ని సీన్స్ తాలూకు ఫొటోస్
సినిమా ఫస్ట్ లుక్ సంగతి ఏమో గాని ఫొటోస్ మాత్రం బాగానే లీక్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్న కొన్ని ఫొటోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విదేశాల్లో చేస్తున్న కొన్ని సీన్స్ తాలూకు ఫొటోస్ కూడా లీక్ అవ్వడం అందరికి ఆశ్చర్యన్నీ కలిగిస్తోంది.

చిత్ర యూనిట్ లోనే ఎవరో ఒకరు
షూటింగ్ స్పాట్ లో అను ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని ఎవరో చాటుగా తీసినట్లు తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ ఫొటోస్ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఇలా ఎవరికీ తెలియకుండా లీక్ అవ్వడం చూస్తుంటే చిత్ర యూనిట్ లోనే ఎవరో ఒకరు ఈ పని చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదే చివరి షెడ్యూల్
ఇక ఫొటోస్ లో అను ఇమ్మాన్యుయేల్ కాస్త గ్లామర్ డోస్ ని బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే సూపర్బ్ అనేలా ఉన్నాడు. ప్రస్తుతం యూరోప్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి ఇదే చివరి షెడ్యూల్. అక్కడ త్వరలోనే షూటింగ్ ముగించేసుకుని వీలైనంత త్వరగా డబ్బింగ్ కార్యక్రమాలను కుడా పూర్తి చేసుకోనుంది ఈ చిత్రం.


Click it and Unblock the Notifications











