ఒకేసారి ఐదు సినిమాలు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్!
పవన్ కల్యాణ్ ఐదు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. జయంత్ దర్శకత్వంలోని సినిమా గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత చిత్రం ఏసు ప్రభువు కథాంశంతో నిర్మితం కానున్న బాలల చిత్రం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రంలో పవన్ పాత్ర ఏమిటో ఇంకా వివరాలు బయటికి రాలేదు. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు. నిర్మాత గతంలో 'చత్రపతి' నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాద్.
మరో సినిమా శ్రీకాంత్ అడ్దాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న మల్టీ స్టారర్. ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి పవన్ నటించనున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా బయటికి వచ్చింది. అది "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఇక స్టార్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో దానయ్య నిర్మించనున్న చిత్రానికి కూడా పవన్ సై అన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











