»   » అలీని ఒక ఆట ఆడుకుంటున్న పవన్ ...భలే ఫన్నీ వీడియో..చూసారా?

అలీని ఒక ఆట ఆడుకుంటున్న పవన్ ...భలే ఫన్నీ వీడియో..చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కు అలీ ఉన్న అనుబంధం తెలయింది కాదు. పవన్ కెరీర్ ప్రారంభం నుంచి అలీ తో వ్యక్తిగతమైన రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు వున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్ లో అలీ ఒకడు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలీకి ఓ రోల్ డెఫినెట్ గా వుటుంది.

దాదాపు పవన్‌ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉంటారు. అలీ వుంటే నటించడానికి నాకు కొంచెం ధైర్యంగా ఉటుంది అని చెబుతుంటారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాటమరాయడులో కూడా పవన్ కళ్యాణ్-అలీలా హంగామా వుంది. తాజగా వీరిద్దరిపై ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

'కాటమరాయుడు' సినిమా సెట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నటుడు అలీ చాలా సరదాగా సమయాన్ని గడిపారని మనకు ఈ వీడియో చూస్తూంటే అర్దమవుతుంది. ఈ వీడియోలో లో పవన్‌.. అలీతో ఓ ఆట ఆడుకుంటూ కనిపించారు. 50 సెకన్ల నిడివిగల ఈ వీడియోలోని ప్రతి సన్నివేశంలో పవన్‌ నవ్వుతూనే ఉండటం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.


శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Here is a fun video of Pawan Kalyan and Ali during the shoot of Katamarayudu. Katamarayudu is an upcoming movie of Power Star Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu