రాంచరణ్, కేటీఆర్ మధ్య పవర్‌స్టార్ చిచ్చు.. పవన్ కల్యాణ్‌తో మెగా హీరోలకు ఇబ్బందులు!
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కూడా విడిపోతుందనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల టాలీవుడ్ పరిశ్రమ హైదరాబాద్‌ను వీడటానికి ఆసక్తి చూపలేదనే విషయం త్వరలోనే అర్ధమైంది. టాలీవుడ్‌ను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను ఇచ్చి ఆకట్టుకొన్నది. ఇలా ఆంధ్రా ప్రభావిత సినీ పరిశ్రమ అడుగులకు కళ్లెం వేయడంతో కొన్ని అపోహాలు తొలగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ వ్యాఖ్యలు కొంత మంది ప్రముఖులను ముఖ్యంగా మెగా హీరోలను ఇరుకున పడేశాయి. అవేమింటంటే..

మెగా హీరోలకు ఇబ్బందికరంగా మారిన
పలు రాయితీలు, సులభమైన అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ చేరువైంది. ప్రభుత్వానికి భేషరతుగా సినీ ప్రముఖులు అండగా నిలిచారు. అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. పరిస్థితి ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు, తెలంగాణేతరులపై ఓ బలమైన వర్గం రాజకీయ పరమైన దాడి చేస్తున్నదని పవన్ వ్యాఖ్యలు చేయడంతో మెగా ఫ్యామిలీ హీరోలు కొంత ఇబ్బందికి లోనవుతున్నట్టు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా
అలాగే మెగాస్టార్ చిరంజీవికి గానీ, ఇతర మెగా హీరోలకు తెలంగాణ సర్కార్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇటీవల జరిగిన వినయ విధేయ రామ చిత్ర ఆడియో ఫంక్షన్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా విజయం సాధించాలని, సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని హమీ కూడా ఇచ్చారు.

వినయ విధేయ రామ ఫంక్షన్‌లో కేటీఆర్
వినయ విధేయ రామ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవిపై, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల కురిపించారు. మెగాస్టార్‌ను ఓ దశలో ఆకాశానికి ఎత్తేశాడు. రాంచరణ్ కూడా రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ సూచించారు. ఇలా వారి మధ్య బలమైన బంధం ఏర్పడి.. సఖ్యతగా ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య ఉన్న అన్యోన్యత స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు వారి మధ్య ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిందనే మాట వినిపిస్తున్నది.

పవన్ కల్యాణ్ కోసం మెగా హీరోలు
పవన్ కల్యాణ్ అంటే మెగా హీరోలందరికి చాలా ఇష్టం. అలాగే బాబాయ్ పవర్ స్టార్ అంటే హీరో రాంచరణ్‌కు చాలా ఇష్టం. జనసేన పార్టీ విజయం సాధించాలని కోరుకొంటున్నాడు. బాబాయ్ ఆదేశిస్తే పార్టీ ప్రచారానికి వెళ్లడానికి కూడా వెనుకాడనని చెప్పడం కూడా జరిగింది. వరుణ్ తేజ్ ఏకంగా కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తన తండ్రి నాగబాబు నరసాపురం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాగబాబుకు ప్రచారం చేస్తారా లేదా అనే వాదన వినిపిస్తున్నది.

తెలంగాణతో మెగా హీరోల పరిస్థితి ఎలా అంటే
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఆంధ్రావారికి భద్రతకు ముప్పు ఏర్పడింది అని పవన్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పు పట్టే పరిస్థితి రాంచరణ్‌కు లేకపోయింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్ధించే అవకాశం లేకపోవడం మరింత ఇరుకున పడేసినట్టు కనిపించింది. దాంతో వారి మధ్య ఉన్న సంబంధాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు భలే దెబ్బ తీశాయనే ఓ వర్గంలో వినిపిస్తుండగా, మరో వర్గం మాత్రం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాయి.


Click it and Unblock the Notifications











