పవన్‌తో అల్లు అర్జున్ విభేదాలు సమిసిపోయాయా? ఆలింగనంతో ఫ్యాన్స్ హ్యాపీ!
గత కొద్దికాలంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రిలేషన్స్ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఇటీవల వారిద్దరూ కలుసుకొన్న దాఖలాలు అరుదు. కొన్ని నెలలుగా పవన్, బన్ని అభిమానులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి అంతం లేదా అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు సమీకరణాలు మారాయి. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీ ఒక్కతాటిపైకి వచ్చినట్టు కనిపిస్తున్నది. శుక్రవారం పవన్ ఫిలిం ఛాంబర్ వద్ద చేసిన హడావిడి సందర్భంగా వారిద్దరూ కలిసిపోయారు. ఏం జరిగిందంటే..

పవన్, బన్నీ అభిమానుల వార్..
పవన్‌తో విభేదాల నేపథ్యంలో భాగంగా కొంత కాలం ముందు అల్లు అర్జున్ ఒక సభలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడు. ఆ సంఘటన తరువాత పవన్ అభిమానులు కొంతకాలం బన్నిని తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా పవన్, బన్ని అభిమానులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి అంతం లేదా అనుకున్నారు అంతా.

అల్లు అరవింద్ ప్రెస్ మీట్
తాజా పరిణామాలు చూస్తుంటే బన్ని, పవన్ ఫాన్స్ ఒక ఉద్యమం గురించి ఫైట్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ను ఆయన తల్లిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి తిట్టడం.. దీని వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడనే విషయం బయటపడడం.. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వర్మను చీల్చి చెండాడడం వంటివి మనం చూసాం.

నా వెనక కుట్ర జరుగుతోంది
తాజాగా ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నా తల్లిని తిట్టడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ.. నా కుట్ర వెనక చేస్తున్నది ప్రముఖ మీడియా ప్రతినిధులని వారి ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడం జరిగింది.

అభిమానులను ఆనందపరిచింది
ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి, తనకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఉద్యమంలో భాగంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం కోసం స్వయంగా ఛాంబర్ కు రావడం జరిగింది. పవన్, బన్ని కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అభిమానున్ని ఆనందపరిచింది.


Click it and Unblock the Notifications











