AP Swearing Ceremony: ఆమెకు బాలయ్య ముద్దు.. ఆయన కాళ్లు పట్టుకున్న పవన్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకరణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. అందులో ముఖ్యంగా పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ చేసిన పని హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ వీళ్లిద్దరూ ఏం చేశారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
మోదీ రాకతో ఫుల్ జోష్
ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ సమీపంలోని కేసరిపల్లి దగ్గర జరిగిన ప్రమాణ స్వీకరణ మహోత్సవం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. దీనికి ప్రధాని మోదీతో పాటు ఎంతో మంది నాయకులు, ప్రముఖులు హాజరై దీన్ని సక్సెస్ చేశారు.

చంద్రబాబు అనే నేను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ కనిపించారు.

బాహుబలి రేంజ్‌లోనే
చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. 'కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను' అని జనసేనాని అనగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ సీన్ 'బాహుబలి' సన్నివేశాన్ని గుర్తు చేసింది. పవన్ ప్రమాణ స్వీకారం సమయంలో జనసేన కార్యకర్తలు ముఖాలు వెలిగిపోయాయి.

కాళ్లకు నమస్కరించి
పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం సమయంలో వేదిక మీద ఉన్న చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ భార్య అన్నా లెజినోవా ఇదంతా వీడియో తీస్తూ మురిసిపోతూ కనిపించారు.
బాలయ్య ముద్దు పెట్టి
ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తంలో తన సోదరి నారా భువనేశ్వరి స్టేజ్‌పై కూర్చున్న సమయంలో నందమూరి బాలకృష్ణ వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత తన సోదరి నుదిటిన ముద్దు పెట్టి ప్రేమను చూపించారు. వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











