Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అసలు సిసలు అప్డేట్.. పవన్ కళ్యాణ్-క్రిష్ ప్రాజెక్ట్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్!
పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నారు. అప్డేట్ల మీద అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ వకీల్ సాబ్ ప్రమోషన్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించేశాయి. అయితే తాజాగా మరో మూవీ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ను ఇచ్చేశారు. క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ గురించి అసలు సిసలు అప్డేట్ ఇచ్చేశారు.
క్రిష్ ప్రాజెక్ట్ అలా..
క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ అప్పుడెప్పుడో మొదలైంది. అయితే కరోనా, లాక్డౌన్ వల్ల అంతా తారుమారైంది. అయితే షూటింగ్ మొదలుపెడదామని అనుకునే ప్రతీ సారి ఏదో అడ్డంకి ఏర్పడుతూనే వచ్చింది. అయితే చివరకు మరో సినిమా మధ్యలోకి వచ్చి చేరింది.
ఆ రీమేక్‌తో ఇలా..
వకీల్ సాబ్ సినిమా తరువాత క్రిష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మధ్యలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ వచ్చి పడింది. ఈ సినిమాకు తక్కువ డేట్స్ ఇవ్వడం, త్వరగా పూర్తి అవుతుందని ఈ సినిమాను మొదలుపెట్టారు.
క్రిష్ ప్రాజెక్ట్ కోసం..
ఇక ఈ మధ్యే క్రిష్ ప్రాజెక్ట్ కోసం ఓ భారీ సెట్‌ను వేశారట. చార్మినార్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడుతోంది. 17వ శతాబ్దం నాటి పరిస్థితులను మళ్లీ తెరపై చూపించేందుకు క్రిష్ భారీ ప్రయత్నాలు చేస్తున్నాడట.
అప్డేట్ అలా..
అయితే తాజాగా క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మార్చి 11న రిలీజ్ చేయనున్నామని తెలిపారు.
అలా ప్రచారం..
క్రిష్ తన ప్రాజెక్ట్‌కు పేరు పెట్టడంలో ఎంతో నిష్ణాతుడో అందరికీ తెలిసిందే. గమ్యం, కంచె, కృష్ణంవందేజగద్గురం వంటి టైటిల్స్ జనాల్లో ఎంతో ఎక్కేశాయి. అలా ఈ సినిమాకు కూడా మంచి టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. విరూపాక్ష అనే టైటిల్ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. మరి సినిమాను టైటిల్ ఏమై ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.