twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్, ప్రభాస్ భారీ విరాళం.. వరద కష్టాలకు కారణమదే..పవర్‌స్టార్.. కేటీఆర్ రియాక్షన్ అలా!

    |

    తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరద తాకిడితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యమయ్యాయి. ఆస్థి, ప్రాణ నష్టం జరగడంతో విషాదంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న దయనీయ పరిస్థితిపై స్పందిస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

    కరోనా కష్టాలు ఇంకా తీరకముందే

    కరోనా కష్టాలు ఇంకా తీరకముందే

    గత కొద్ది నెలలుగా ప్రజలు కరోనావైరస్, లాక్‌డౌన్ పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఆర్థిక కష్టాల నుంచి బయటపడలేదు. ఇప్పుడిప్పుడే కుదురుకొంటుండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టింది. దశాబ్దాల కాలంగా ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో తెలంగాణ రాష్ట్రంలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

    అందుకే పలు ప్రాంతాలు నీట మునిగి

    అందుకే పలు ప్రాంతాలు నీట మునిగి

    తెలుగు రాష్ట్రాలపై భారీ వర్షాల ప్రభావం భారీగా పడింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతికూల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజల జీవన విధానం చిన్నాభిన్నమైంది. జన జీవనం చిధ్రమైంది అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఆర్థిక కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో

    ఆర్థిక కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో

    తెలంగాణలో పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రస్తుత సమయంలో ప్రజలను, ప్రభుత్వాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉంది. ప్రపంచం మొత్తం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులను అర్ధం చేసుకొని నా వంతుగా కోటి రూపాయల సహాయం అందజేయాలని నిర్ణయించుకొన్నాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.

    ప్రజలకు అండగా నిలువాలని

    ప్రజలకు అండగా నిలువాలని

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అర్ధం చేసుకొని జనసైనికులు తమ వంతు బాధ్యతగా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా నిలువాలని జనసేన కార్యకర్తలు, అభిమానులకు నేను కోరుతున్నాను. మీరందరూ మనస్పూర్తిగా సహాయా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అభిమానులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

    ప్రభాస్ సహాయానికి కేటీఆర్ రిప్లై

    ప్రభాస్ సహాయానికి కేటీఆర్ రిప్లై

    ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం వరద ముంపునకు గురి కావడంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆవేదన చెందారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలువాలని ప్రభాస్ నిర్ణయించుకొన్నారు. తన వంతు బాధ్యతగా ఆయన కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ఆర్థిక సహాయం ప్రకటించడంపై కేటీఆర్ థ్యాంక్యూ ప్రభాస్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతీ సినీ ప్రముఖుడికి కేటీఆర్ థ్యాంక్యూ చెబుతూ ట్వీట్ చేయడం గమనార్హం.

    English summary
    Power Star and Jana Sena Chief Pawan Kalyan and Prabhas gets emotional on Hyderabad floods. They come forward for to give moral support to Telanagana Government. Both superstars has donates 1 crore rupees for Telangana CM relief fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X