BRO Movie Teaser: పవన్, సాయి తేజ్ ఊరమాస్.. పూనకాలు తెప్పించేలా బ్రో టీజర్.. హైలైట్ ఏంటేంటే!

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో కొత్త కొత్త జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చాలానే వస్తున్నాయి. అందులోనూ మల్టీస్టారర్‌గా వచ్చే చిత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అలా చాలా సినిమాలు తెలుగులో రూపొందుతోన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో (BRO)' ఒకటి. ఆరంభం నుంచే క్రమంగా అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మెగా హీరోల బ్రో టీజర్ ఎలా ఉందో మీరే చూసేయండి మరి!

బ్రో అంటూ వస్తున్నారు: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రమే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తోంది.

 Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Teaser Released

రిలీజ్ డేట్‌కు చేరువగా: మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీని జూలై 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్లను కూడా ఇచ్చేస్తున్నారు.

 Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Teaser Released

ప్రమోషన్స్.. టీజర్‌తోనే: దేవుడు - భక్తుడు - వరం అనే కాన్సెప్టుతో విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న 'బ్రో (BRO)' మూవీ రిలీజ్‌కు డేట్ దగ్గర పడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఎన్నో పోస్టర్లను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది.

మెగా హీరోల ఊరమాస్: మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న 'బ్రో (BRO)' మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే యాక్షన్‌తో అలరించారు. ముఖ్యంగా ఇద్దరూ తమదైన మేనరిజం, స్టైల్స్‌, యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. అలాగే, డైలాగులతోనూ దుమ్ముదులిపేశారు. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

అవే ఇందులో హైలైట్: 'బ్రో (BRO)' మూవీ టీజర్ మెగా అభిమానులనే కాకుండా అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. ముఖ్యంగా ఇందులో హీరోలను చూపించిన తీరు, విజువల్స్, థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్లుగా నిలిచాయని చెప్పొచ్చు. అందుకే ఈ టీజర్ విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. అదే సమయంలో సినిమాపై అంచనాలనూ పెంచేసింది.

ఆసక్తికరంగా డైలాగ్స్: 'బ్రో (BRO)' మూవీ టీజర్‌లో పవన్‌ కల్యాణ్ నుంచి వచ్చే డైలాగులు మాత్రం ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ముందుగా ఇందులో 'కాలం.. మీ గడియారానికి అందని ఇంద్రజాలం' అంటూ వేదాంత ధోరణిలో ఓ మాట చెప్పాడు. అలాగే, చివర్లో 'సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు' అంటూ వేసిన పంచ్ డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X