పాన్ ఇండియా డైరెక్టర్‌తో పవన్: అలాంటి కథతో మూవీ.. OG అంటూ అసలైందే రివీల్ చేశారుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా హవాను చూపిస్తోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన పవన్.. ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా ప్రకటించేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్‌తో కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు కూడా చూసేయండి మరి!

వరుస చిత్రాలు.. ఫుల్ ఫామ్‌లో

వరుస చిత్రాలు.. ఫుల్ ఫామ్‌లో


సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో కమ్‌బ్యాక్ అయిన ఈ స్టార్ హీరో.. ఇది పట్టాలపై ఉండగానే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమానూ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్స్ ఇచ్చాడు.

పవన్ దృష్టి మొత్తం దానిపైనే

పవన్ దృష్టి మొత్తం దానిపైనే


ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలు చిత్రాలు ఓకే చేసినా 'హరిహర వీరమల్లు' మూవీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రాబోతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ టార్గెట్ చేశాడు.

హరీశ్ శంకర్‌తో సినిమా డౌటే

హరీశ్ శంకర్‌తో సినిమా డౌటే


'వకీల్ సాబ్' మూవీ చేస్తోన్నప్పుడే పవన్ కల్యాణ్ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో తనకు గతంలో 'గబ్బర్ సింగ్' వంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్‌తోనూ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన షూట్ మరింత ఆలస్యం కాబోతుంది.

పాన్ ఇండియా డైరెక్టర్‌తో ఓకే

పాన్ ఇండియా డైరెక్టర్‌తో ఓకే


2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోన్న పవన్ కల్యాణ్.. రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పవర్ స్టార్.. 'సాహో' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ సుజిత్‌తో సినిమాను ప్రకటించాడు.

 RRR ప్రొడ్యూసర్.. పోస్టర్‌తో

RRR ప్రొడ్యూసర్.. పోస్టర్‌తో


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించే సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచింది.

 అలాంటి కథ... OG అంటూ

అలాంటి కథ... OG అంటూ


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అంటూ సినిమాపై ఓ హిట్ కూడా ఇచ్చేసింది. ఇక, ఇందులో పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని నిల్చున్న స్టిల్ చూపించగా.. దాని నీడ మాత్రం ఓ పెద్ద గన్‌లా కనిపిస్తుండడం విశేషం.

 ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్

ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్


సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమాను ఈ నెలలోనే మొదలు పెట్టబోతున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X