Tirumala: తిరుమలలో పవన్ కల్యాణ్ సతీమణి భారీ విరాళం.. మహా అన్నదానానికి ఎంత ఇచ్చారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ఓ ఇంటర్నేషన్ లో స్కూల్లో ఆయన చదువుకుంటున్నారు. ఏప్రిల్ 8న ఆ స్కూల్ లోని ఓ భవనంలో ఉన్నట్టుండిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి మార్క్ శంకర్ గురైన సంగతి తెలిసిందే. ఇక నిన్న మార్క్ శంకర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బాలుడు కాస్తా కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు.

అయితే, కొడుకు కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13న ఆదివారమే తిరుపతిలో ఏడుకొండల శ్రీవారిని దర్శణం చేసుకుంది. తన కొడుకు మార్క్ శంకర్ కు ప్రాణాపాయం తప్పడంతో అన్నా లెజినోవా తిరుమలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అలాగే కళ్యాణ కట్టలో తలనీళాలు కూడా సమర్పించి మొక్కు తీర్చుకుంది. తన మతం, కులం అన్నీ పక్కన పెట్టి మరీ కొడుకు ప్రాణాలకు ప్రమాదం తప్పడంతో శ్రీవారి సన్నిధిలో సేవలు చేసింది. హిందూ ధర్మాన్ని అనుసరించింది.

Pawan Kalyan Anna Lezhneva 65 Lakhs Donation to Tirumala Temple Here is why

అంతే కాదు ఈరోజు ఉదయం 6 గంటలకే శ్రీవారి ప్రత్యేక సేవ, హారతీ, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలాగే తిరుమలను సందర్శించే భక్తుల కోసం మహా అన్నదానం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాల తనయుడు మార్క్ శంకర్ పేరున అన్నదానికి లక్షల్లో విరాళం ఇచ్చారు. ఏకంగా రూ.17 లక్షలు విరాళంగా అందించి భక్తులకు ఈరోజు అన్నదానం చేయిస్తున్నారు. అయితే తిరుమల అన్నదాన సత్రానికి పవన్ కళ్యాణ్ భార్య రూ.45 లక్షల విరాళం అందించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల అన్నప్రసాదానికి మార్క్ శంకర్ పేరుపై 17లక్షలు డొనేట్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ నుంచి రూ.62 లక్షలు తిరుమలకు విరాళం అందింది.

ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడానే ఉంది. బాలుడు కోలుకున్నారు. ఏప్రిల్ 8న అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ గాయపడ్డాడు. కాళ్లు, చేతులకు మంటలకు గాయపడ్డాయి. అలాగే భవనంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరితిత్తుల్లోకి చూరి శ్వాస తీసుకోవడం బాలుడికి ఇబ్బందిగా మారింది. దాంతో వెంటనే సింగపూర్ లోని ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించారు.

మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్ కు వెళ్లి మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్స్ ను తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ చూరడంతో మళ్లీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని సింగపూర్ ఆస్ప్రతి వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఇక హెల్త్ బాగానే ఉందని పరీక్షల్లో తెలియడంతో డిశ్చార్జ్ చేశారు. నిన్న మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తీసుకొచ్చిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మొత్తానికి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X