బిగ్ బ్రేకింగ్: టీడీపీతో కలిసి ఎన్నికలకు.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య, లోకేష్ కలిసి రాజమండ్రి జైలుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబుతో మాట్లాడి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవెల్మెంట్ వ్యవహారంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ విషయంపై గత రెండు మూడు రోజులుగా ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా.. టీడీపీ శ్రేణులు సైతం నిరసనలు చేస్తున్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందుపురం ఎమ్మెల్యే బాలయ్య, లోకేష్ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడారు. బాబుతో ములాఖత్ నిర్వహించిన వీరు... వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలి.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక బాబుకు దైర్యం చెప్పిన అనంతరం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నాం. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చాను. సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడాను. నేను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయని చెప్పుకువచ్చారు. .

దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి నేను. దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నాను. మోదీకి మద్దతు తెలిపిన సమయంలో నన్ను అందరూ తిట్టారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను. ఏ రోజు కూడా మోదీ పిలిస్తేనే వెళ్లాను. ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయనని వెల్లడించారు.
2014లో భాజపా, తెదేపాకు మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉంది. విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నాను. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. చంద్రబాబు అనుభవం, సమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉంది. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై తప్పుడు కేసులా?.. రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారు. ఉదాహరణకు ఎవరో చేసిన తప్పును బ్యాంకు ఛైర్మన్‌కు అంటగడతామా? అంటూ ప్రశ్నించారు.

2013లో ఈ కంపెనీ గుజరాత్‌లో ప్రారంభమైంది. ఇవాళ్టి ములాఖత్ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైంది. పవన్ జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-తెదేపా కలిసే వెళ్తాయని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











