‘మగధీర’ పై పెదవి విరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!??
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? గతంలో పోకిరి సినిమా రికార్డు స్థాయిలో 48 కోట్లు వసూలు చేసింది. అయితే ఆ తరువాత 'మగధీర" సినిమా వచ్చి ఆ రికార్డును కూడా తుడిచి పెట్టేసింది. ఈ నెపథ్యంలో హిట్ సినిమా అంటే కేవలం డబ్బులు కలెక్ట్ చేసేదే అని ఫిక్స్ అయిపోయారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా కాదంటున్నారు. ఎక్కువ ప్రింట్ లు వేసి దేశ విదేశాల్లో రిలీజ్ చేసి కలెక్షన్ బట్టి హిట్ రేంజ్ ఎలా నిర్ణయిస్తారు అంటున్నారు.
హిట్ రేంజ్ ని బట్టి కాక ప్రేక్షకుల హదయాల్లో ఎంతకాలం ఉందనేదానిని బట్టి సినిమా రేంజ్ నిర్ణయించాలని పవర్ స్టార్ అభిప్రాయ పడ్డారు. నా సినిమాల వరకు ఎంత వసూలు చేసాయనే దానికన్నా ఎంత మందికి చేరింది అనేది ముఖ్యం అన్నారు. ఎటూ నా మార్కెట్ రేటు నాకు ఉంది అని అంటున్నారు పవన్.
పవన్ కళ్యాణ్ మగధీర రామ్ చరణ్ తేజ పోకిరి మహేష్ బాబు pawan kalyan magadheera ram charan teja pokiri mahesh babu


Click it and Unblock the Notifications