'కౌబాయ్' గెటప్ లో పవన్ కెవ్వు కేక
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ త్వరలో కౌబాయ్ గా కనిపించి అబిమానులను అలరించనున్నారు. ఈ గెటప్ లో తొలిసారి 2000 లో వచ్చిన బద్రి చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత అన్నవరం చిత్రంలో ఓ పాటలో కనపడ్డారు. ఇప్పుడు మళ్లీ పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం కోసం గెటప్ వేస్తున్నారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటకు కౌబోయ్ గెటప్ తో, ఫారిన్ మోడల్స్ తో పవన్ అదరకొట్టనున్నారు. ప్రస్తుతం ఈ పాటను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. దీనీష్ కొరియోగ్రఫీలో ఈ పాట తెరకెక్కుతోంది.
తొలి కలయిక 'బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. 'బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. 'గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇందులో పవర్‌స్టార్ మెకానిక్ గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్: యూనివర్సల్ మీడియా
నటీనటులు: పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: మణిశర్మ
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











