Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రత్నవేలును అభినందించిన పవన్.. ఇలాంటి ప్రశంసలు ఇంతవరకు రాలేదు.. భావోద్వేగమైన ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి సైరాతో వెండితెరపై గర్జించారు. సైరా చూసిన ప్రతీ ఒక్కరూ చిరు నటనకు మంత్ర ముగ్దులు కావాల్సిందే. చిరు చెప్పిన డైలాగ్స్, చేసిన పోరాట సన్నివేశాలకు అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడా?అనేంతగా ప్రేక్షకులను కట్టిపడేశాడు..
టెక్నికల్ గా అబ్బురపరిచిన సైరా..
ఈ సినిమాలోని నటీనటులు, దర్శకత్వం, కథ చెప్పిన విధానం, కథనాన్ని ఉత్కంఠగా మార్చిన తీరు ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఆర్ట్ విభాగం, క్యాస్టూమ్ విభాగం, అప్పటి కాలాన్నే మనం చూస్తున్నామా? అనేట్లు గతంలోకి తీసుకెళ్లిన సినిమాటోగ్రఫీ ఇవన్నీ సినిమాను మరో లెవెల్లో నిలబెట్టాయి.
రత్నవేలు పనితనం..
మామూలు సన్నివేశం తీసినా, గగుర్పొడిచే యుద్ద సన్నివేశాలను తెరకెక్కించిన కెమెరామెన్ తన ప్రతిభతో దాని స్థాయిని మరింత పెంచేస్తాడు. హీరో హీరోయిన్లనే అందంగా తెరపై చూపించడంలో రత్నవేలు ఎంతటి ఘనుడో అందరికీ తెలిసిందే. సైరాలో రత్నవేలు పనితనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందేనని అంటున్నారు.
సైరా విజయం.. పవన్ ప్రశంసలు
సైరా అద్భుతమైన విజయం సాధించినందుకు, అందులో రత్నవేలు పడిన కష్టాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఒక లెటర్ రాసి.. గులాబీ పూలను కానుకగా పంపాడు. డియర్ రత్నవేలు.. సైరా గ్రాండ్ సక్సెస్ అయినందుకు అభినందనలు.. మీకు మున్ముందు మరింత మెరుగైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రత్నవేలును ప్రశంసించారు. ఈ విషయాన్ని రత్నవేలు.. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..
ఇలాంటి గొప్ప ప్రశంసలు కురిపస్తున్న మీడియా, సోషల్ మీడియా, స్నేహితులందరికీ థ్యాంక్స్ చెబితే అది చిన్న పదమే అవుతుంది. దేశ వ్యాప్తంగా, ఓవర్సీస్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది... నా జీవితంలో ఇంత మంచి ప్రశంసలు నేనింత వరకు అందుకోలేదు.. అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశాడు.