పవన్ ‘తీన్ మార్’లో రెండు పాత్రల పేర్లు ఏంటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ఫై జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తీన్ మార్'. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న నిర్మాత గణేష్ బాబు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. త్రిష , కీర్తి కర్భంద పవన్ తో జోడికడుతున్న ఈ చిత్రం హిందీ 'లవ్ అజ్ కల్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఓ పాత్ర పేరు 'మైఖేల్ వేలాయుధం", రెండో పాత్ర పేరు అర్జున్ పాల్వాలయి. కాగా అర్జున్ పాల్వాలయి పాత్ర చాలా బాగుంటుందట. కామెడీ కామెడీగా సాగుతుందని సమాచారం. ఈ చిత్రం ఆడియో వేడుకలో పవన్ పోషించిన రెండు పాత్రల్లో తనకు అర్జున్ పాల్వాయ్ పాత్ర ఇష్టమని నాగబాబు పేర్కొన్నాడు. మరి ఈ క్యారెక్టర్ అభిమానులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే. తరాల మద్య అంతరాన్ని, ప్రేమను దక్కించుకునే విధానంలో వచ్చిన మార్పును చర్చిస్తూ వినోదాత్మకంగా సాగే ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని పవన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. త్రివిక్రమ్ రచన సహకారం అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











