»   » యుక్తా ఫోటోలు: లండన్లో పవన్ కళ్యాణ్‌కి గ్రాండ్ వెల్‌కం, ఏం మాట్లాడారంటే..

యుక్తా ఫోటోలు: లండన్లో పవన్ కళ్యాణ్‌కి గ్రాండ్ వెల్‌కం, ఏం మాట్లాడారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యుక్తా(UKTA-యూనైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్) 6వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే యూక్తా వార్షికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో ఈ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.దాదాపు 2 వేల మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు.

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...తెలుగు సంప్రదాయాలను భావితరాలకు పంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో పవన్ సమావేశమయ్యారు. తన సినిమాల్లో ఇలాంటి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చూస్తానని ఆయన తెలిపారు.

అంతకు ముందు...శుక్రవారం సాయంత్రం లండన్ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు నిర్వాహకులు, అభిమానుల నుండి గ్రాండ్ వెల్ కం లభించింది. భారీ సంఖ్యలో అభిమానులు లండన్ ఎయిర్ పోర్టుకు తరలి వచ్చారు. పదుల సంఖ్యలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఆయన్ను అక్కడి నుండి ర్యాలీగా తీసుకెళ్లారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి వేడుకలకు ముందు నుండీ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన తొలిసారి ఇలాంటి ఎన్నారై సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. 

స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ లండన్ ఫోటోస్....

మొదటిసారి

మొదటిసారి

పవన్ కళ్యాణ్ లండన్లో మొదటి సారి ఎన్నారైల వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు.

శరత్ మరార్ కూడా

శరత్ మరార్ కూడా

పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాత శరత్ మరార్ కూడా వచ్చారు.

అభిమానుల హడావుడి

అభిమానుల హడావుడి

లండన్ ఎయిర్ పోర్టు వద్ద పవన్ కళ్యాణ్ రాక సందర్బంగా అభిమానులు జాతీయ జెండా ప్రదర్శిస్తూ హడావుడి చేసారు.

గ్రాండ్ వెల్ కం

గ్రాండ్ వెల్ కం

యుక్తా నిర్వాహకులు, అభిమానుల సమక్షంలో పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్ కం లభించింది.

పవన్ చేతుల మీదుగా సన్మానం

పవన్ చేతుల మీదుగా సన్మానం

యుక్తా వేడుకల్లో కూచిపూడి నాట్యారామం కళాకారులను, సాంప్రదాయ కూచిపూడి కళాకారులను, గబ్బర్ సింగ్ ఫేం జానపద సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ ను పవన్ కళ్యాణ్ సన్మానిస్తారు.

అభిమానులను ఉద్దేశించి

అభిమానులను ఉద్దేశించి

అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని నిర్వహికులు తెలిపారు. అయితే ఆయన ప్రసంగంలో ఏయే అంశాలు వస్తాయనేది హాట్ టాపిక్ అయింది.

ఫోటో సెషన్

ఫోటో సెషన్

దీంతో పాటు లండన్ లోని అభిమానులతో పవన్ కళ్యాణ్ ఫోటో సెషన్లో పాల్గొనబోతున్నారు.

యుక్తా హైలెట్

యుక్తా హైలెట్

పవన్ కళ్యాణ్ రాకతో యుక్తా వేడుకలు తెలుగు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి.

ర్యాలీ

పవన్ కళ్యాణ్ ను గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్న అభిమానులు ఆయన్ను కార్ల కాన్వాయ్ తో ర్యాలీగా తీసుకెళ్లారు.

లండన్

లండన్

యూక్తా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ ఫోటోస్

English summary
Pawan Kalyan‬ arrived in London to attend ‎UKTA‬ 6th Anniversary Celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu