హోటల్లో ఛెఫ్ గా పవన్ కళ్యాణ్ కేక పెట్టిస్తారు

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'తీన్ మార్' లో ఓ వైరైటీ రోల్ ని ప్లే చేయనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులో ఆయన సౌతాఫ్రికాలో ఛెఫ్ గా చేసే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ఆయన తన దైన స్టైల్ లో త్రివిక్రమ్ పంచ్ డైలాగులు చెప్తూ నవ్వించనున్నారని తెలుస్తోంది. ఇక రెండో పాత్ర మాస్ ఓరియెంట్ డ్ గా నడిచే కాలేజి స్టూడెంట్ పాత్ర. తెలంగాణా నేఫధ్యంలో నడిచే ఈ పాత్ర సినిమాకి హైలెట్ గా ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. అలాగే.. మహాశివుడ్ని కీర్తిస్తూ...

వారణాసిలో జయ బోలో శివ శంకర్ అంటూ వచ్చే పాట హైలెట్ అవుతుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ నటన, త్రిష గ్లామర్, త్రివిక్రమ్ మాటలు, మణిశర్మ సంగీతం, జయంత్ టేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ చిత్రాన్ని రికార్డు హిట్‌గా నిలబెట్టడం ఖాయమని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్: బడే రవికిరణ్, సమర్పణ: శివబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X