‘గబ్బర్‌సింగ్’ గా అదరకొట్టనున్న పవన్ కళ్యాణ్

By Srikanya

పవన్ కల్యాణ్ త్వరలో 'గబ్బర్‌సింగ్" గా కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పవన్ కల్యాణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 'గబ్బర్‌సింగ్" సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ 'దబాంగ్" కి రీమేక్. ఈ చిత్రం గురుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తోలి చిత్రం ఇది. హిందీ సూపర్ హిట్ దబాంగ్ ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గా నటిస్తున్నాను.

హరీష్ శంకర్, నేను కలిసి ఇంతకుముందు ఓ సినిమా చెయ్యాల్సి వుంది. అప్పుడు తను మిరపకాయ్ కధతో పాటు మరికొన్ని కధలు చెప్పాడు. కధ చెప్పేటప్పుడు హరీష్ నేరేషన్ నాకెంతో నచ్చింది. దబాంగ్ రీమేక్ అనుకోగానే హరీష్ అయితే ఈ సినిమాకి కరెక్ట్ అనిపించింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుంది' అన్నారు.అలాగే ఈ చిత్రం హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X