twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : గౌతమ్ నందా గా పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సినిమాలో తన పేరు డిఫెరెంట్ గా ఉండాలని కోరుకుంటాడు. దానికి తగినట్లుగానే ఆ పేర్లు బయిట విపరీతంగా పాపులర్ అవుతాయి. బద్రీలో బద్రీ..బద్రీనాధ్ అని, జల్సా లో సాహు అని, ఖుషి లో సిద్దు ..సిద్దార్ద రాయ్ అని ఇలా ప్రతీ సినిమా తనదైన శైలిలో పవన్ పేరు ఉండేలా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది లో ఆయన పేరు గౌతమ్ నందా. ఆదివారం విడుదల చేసిన టీజర్ ద్వారా అందరికీ ఈ విషయం వెల్లడైంది.

    తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ అఫీషియల్‌గా ఖరారు చేయగానే అంతటా మంచి స్పందన వచ్చింది. ఓ ఫ్యామిలీ చిత్రం రాబోతోందనే అందరిలో ఆసక్తి కలిగింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం' అన్నారు.

    ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, నదియా, అలీ, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

    English summary
    Ace Director Trivikram gives different names to the hero characters in his movies.Even Pawan also very choosy and uses peculiar names to his characters in the films. Like Sanjay Sahu(In jalsa),Sidhdhu Siddharth Roy(Khushi) or earlier hit Gabbar SinghNow the combo of Pawan and Trivikram must gives unique name to Pawan’s role in ‘Atharintiki Daaredi.’ If we seen in first look teaser Pawan’s name listened as Gautham Nanda and he is a richest businessman with high goals in life. Audio release function for the film will be held on July 19th and the movie will hit the screens on Aug 7th 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X