twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ మాఫియా ముఠాలో సీనియర్ సభ్యుడు

    By Srikanya
    |

    ఓ మాఫియా ముఠాలో సీనియర్ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సినిమా మొత్తం గడ్డంతో కొత్త రూపంలో ఆయన కనిపిస్తారు. ఆ రూపంలో ఆయన ఎంతో అందంగా, స్టయిలిష్‌గా ఉన్నారు. ఇందులో పవన్ పేరు జయదేవ్. అంతా జయ్ అని పిలుస్తారు. అంతే గొప్పగా జయ్ పాత్రని పోషించారు అంటున్నారు పంజా చిత్రం గురించి నిర్మాతలు చెప్తున్నారు. అలాగే కోల్‌కతా నేపథ్యంలో నడిచే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. 'పంజా' అనే టైటిల్ పవన్ కల్యాణ్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తుంది. మొదట కొన్ని టైటిల్స్ అనుకున్నా చివరికి అందరికీ నచ్చిన టైటిల్ ఇది. ఇది తెరముందు పవన్ కల్యాణ్ సినిమా అయితే, తెర వెనుక విష్ణువర్ధన్ సినిమా అని చెప్పుకొచ్చారు.

    శ్యామ్ కౌశల్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. సుమోలు, బాంబులు పేలడాలు వంటివి ఇందులో ఉండవు. మితిమించిన హీరోయిజం కనిపించదు. అయినా అవి బాగా ఆకట్టుకుంటాయి. దేశంలోని బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన పి.ఎస్. వినోద్ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఎస్సెట్. సినిమా అంతా విజువల్ ఫీస్ట్‌గా కనిపిస్తుందంటే కారణం ఆయనే. అలాగే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పంజాలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల వాణిజ్య అంశాల్ని సమపాళ్లలో మేళవించిన సినిమా. ఇలాంటి సబ్జెక్టును విష్ణువర్ధన్ అయితే బాగా డీల్ చేస్తారని పవన్ కల్యాణ్‌కు డైరెక్టర్ ఎస్.జె. సూర్య చెప్పడంతో ఆయన ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. విష్ణు 'పంజా' కథని నడిపిన విధానం కానీ, ఆయన టేకింగ్ కానీ అత్యున్నత ప్రమాణాల్లో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు తెలుగులో బ్రహ్మాండమైన డిమాండ్ ఏర్పడుతుంది అన్నారు.

    English summary
    Pawan Kalyan is playing the role named Jaidev/Jai in the film Panja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X