స్టయిలిష్ జేమ్స్ బాండ్‌గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఊసరవెల్లి దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొంద బోతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను స్టయిలిష్ జేమ్స్ బాండ్ గా చూపించబోతున్నారట సురేందర్ రెడ్డి.
ఇప్పటి వరకు తెలుగు తెరపై జేమ్స్ బాండ్ గా కనిపించిన హీరోలు చాలా తక్కవమందే. తెలుగు సినిమా తొలి నాళ్లలో హీరో కృష్ణ జేమ్స్ బాండ్ సినిమాలతో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టి ఆలాంటి సినిమాలు చేయడంలో తనకెవరూ సాటిరారని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలు తెలుగులో చేసిన హీరోలు చాలా తక్కవే...అందులో సక్సెస్ అయిన వారు అసలు లేరనే చెప్పాలి. తాజాగా ఇన్నాళ్ల వపన్ జేమ్స్ బాండ్ గా కనిపిస్తున్నాడనే వార్త రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పంజాని పూర్తి చేసుకుని గబ్బర్ సింగ్ ప్రారంభించారు. అలాగే ఆర్.ఆర్ మూవి మేకర్స్ వారు ..మహేష్ తో ది బిజినెస్ మ్యాన్ చిత్రం తీస్తున్నారు. ఈ లోగా సురేందర్ రెడ్డి హిందీలో రణబీర్ హీరోగా ఊసరవెల్లి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే పవన్-సురేందర్ రెడ్డి చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు పవన్ తో మాట్లాడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకు పవన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











