మూడో పెళ్లి తర్వాత తొలిసారి జనంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఆయన....విదేశీ భామను మూడో పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్య పోయారు. వీరి వివాహం ఎర్రగడ్డలోని రిజిస్టార్ ఆఫీసులో సెప్టెంబర్ 30న జరిగింది.
కాగా....పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత మీడియాలో, జనాల్లో ఇంత చర్చ జరుగుతున్నా ఆయన అవేమీ పట్టించుకోనట్లే ఉంటున్నారు. అయితే ఆయన ఆ తర్వాత ఎక్కడ బయటక కనిపించక పోవడం, ఈ నెల 5న జరుగాల్సిన 'రేయ్' ఆడియో ఫంక్షన్ ఆయన రాక పోవడం వల్ల వాయిదా పడటంతో....పవన్ కళ్యాణ్ కావాలనే బయటకు రావడం లేదనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది.
అయితే వాదనలను పటాపంచలు చేస్తూ.....పవన్ కళ్యాణ్ బుధవారం కింగ్ కోటిలోని భారతీయ విద్యా భవన్‌లో కస్టమ్స్, కల్చరల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

పవన్ కళ్యాణ్ ఉన్నంత సేపు అభిమానులు కేరింతలతో సందడి చేసారు. ఈ వేడుకలో నాటకాలు, డాన్సులు, మిమిక్రి, వోకల్ లైట్ తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పలువురికి బహుమతి ప్రధానోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా పవన్ తన ప్రసంగంలో పర్సనల్ విషయాల గురించి మాట్లాడతారని అంతా ఊహించారు. కానీ అలాంటి దేమీ జరుగలేదు. పవన్ తన పర్సనల్ అంశాల ప్రస్తావన తేలేదు. నిర్వాహకులు, కళాకారుల పనితీరును మెచ్చుకున్నారు. మరి 'రేయ్' ఆడియో వేడుకలో పవన్ తన గురించి విషయాలు మాట్లాడతారో? లేదో?


Click it and Unblock the Notifications