మహాకార్యం కోసం పవన్ పయనం.. ఆయన మరణం కలిచివేసిందంటూ!

గత కొద్దికాలంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినప్పటీకీ.. ఆయన హరిద్వార్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ పరిస్థితుల్లో ఆయన హరిద్వార్ పయనం ఎందుకు చేపట్టినట్లు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

గంగా ప్రక్షాళన కోసం పోరాటం.. జీడీ అగర్వాల్ మరణం

గంగా ప్రక్షాళన కోసం పోరాటం.. జీడీ అగర్వాల్ మరణం

స్వామి జీడీ అగర్వాల్ గంగా ప్రక్షాళన కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేశారు. ఆయన పూర్తి పేరు గురుదాస్ అగర్వాల్. విద్యావేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా ఎన్నో సామాజిక అంశాలపై ఉద్యమించిన ఆయన.. గంగా ప్రక్షాళన కోసం పోరాటం చేస్తూ 2018 అక్టోబర్ 11వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు.

రాజేంద్ర సింగ్ అభ్యర్థన.. పవన్ పయనం

రాజేంద్ర సింగ్ అభ్యర్థన.. పవన్ పయనం

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్వామి జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి గురించి పవన్ కళ్యాణ్ కి వివరించారు రాజేంద్ర సింగ్. ఈ మేరకు హరిద్వార్ లో జరగనున్న జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి సమావేశానికి హాజరు కావాల్సిందిగా పవన్‌ని కోరారు రాజేంద్ర సింగ్.

సాదర స్వాగతం.. సంప్రదాయ తలపాగాతో

సాదర స్వాగతం.. సంప్రదాయ తలపాగాతో

రాజేంద్రసింగ్ ఆహ్వానం మేరకు గురువారం సాయంత్రం డెహ్రాడూన్ చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా హరిద్వార్‌లోని మాత్రి సదన్‌కు చేరుకొన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయనను సాదరంగా ఆహ్వానించి తలకు సంప్రదాయమైన తలపాగాను చుట్టారు రాజేంద్రసింగ్. ఈ ఆశ్రమంలోనే జీడీ అగర్వాల్ గంగా ప్రక్షాళన కోసం పోరాటం చేశారు.

 పవన్ తో పాటు రాజేంద్రసింగ్

పవన్ తో పాటు రాజేంద్రసింగ్

గంగా ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం చేసిన జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. పర్యావరణ అవశ్యకత గురించి స్పందించారు. ఈ సందర్బంగా గంగా ప్రక్షాళన కోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కి సూచించారు రాజేంద్ర సింగ్. పవన్ కల్యాణ్‌లో జీడీ అగర్వాల్ పోరాట స్ఫూర్తిని చూశానని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

 ఆయన మరణ వార్త కలిచి వేసింది

ఆయన మరణ వార్త కలిచి వేసింది

ఆ తరువాత మాట్లాడిన పవన్ కళ్యాణ్.. గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమే అన్నారు. తాను పోరాట యాత్రలో ఉండగా జీడీ అగర్వాల్ మరణ వార్త తెలిసిందని, ఓ మహత్తర కార్యక్రమం కోసం ప్రాణాలు అర్పించడం తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. ఆ రోజునే హరిద్వార్‌కు వచ్చి జీడీ అగర్వాల్‌కు శ్రద్దాంజలి ఘటించాలని అనుకొన్నానని, కానీ పోరాట యాత్రలో ఉన్నందున సాధ్యపడలేదని పవన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X