హోటల్ ఇన్ సెంట్రల్ లో జనసేనాని: అవార్డు అందుకోనున్న పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
ఈ రోజు ఇండియా యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రదానం చేయనున్న ప్రతిష్టాత్మక "గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు"ను పవన్ అందుకోనున్నాడు. ఇందు కోసం గురువారం మధ్యాహ్నానికి లండన్ చేరుకున్నాడు పవన్.
Recommended Video

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ ఇండీ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందించనున్న ఎక్సలెన్సీ అవార్డ్ కి ఎంపికయిన సంగతి తెలిసిందే. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను పవన్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు.

గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు
ఈ రోజు ఇండియా యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రదానం చేయనున్న ప్రతిష్టాత్మక "గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు"ను పవన్ అందుకోనున్నాడు. ఇందు కోసం గురువారం మధ్యాహ్నానికి లండన్ చేరుకున్నాడు పవన్. శుక్ర, శని వారాల్లో లండన్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు.

లండన్‌లోని వివిధ యూనివర్సిటీల
18వ తేదీన లండన్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో వెస్ట్ మినిస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లోని కింగ్స్ మెడికల్ కాలేజీలో పవన్ భేటీ అవుతారు. పవన్ పర్యటనకు సంబంధించి యూరఫ్‌లోని జనసేన కార్యకర్తలు, లండన్‌లోని తెలుగువారు ఏర్పాట్లు చేస్తున్నారు.

హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో
కళలు, రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషిగాను హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ప్రఖ్యాత ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఈ అవార్డును పవన్‌కు ప్రదానం చేయనుంది. ఇందులో భాగంగానే యూరప్‌లో షూటింగ్ ముగించుకున్న పవన్ లండన్ చేరుకున్నారు. దీంతో అభిమానులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు.

ఫోటోలు సోషల్‌మీడియాలో
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్ అవుతున్నాయి. రెండు రోజుల లండన్ పర్యటనలో పవన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. కొద్ది రోజులుగా PSPK25 సినిమా కోసం విదేశాలలో ఉన్న పవన్ అక్కడి నుండి డైరెక్ట్‌గా లండన్ వెళ్లాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుండగా, సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications