చెర్రీ బర్త్‌డే వేడుకలో పవన్.. రాంచరణ్ ఆనందం రెట్టింపు.. ఘనంగా సెలబ్రేషన్
Recommended Video

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు నేడు (మంగళవారం) హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది అభిమానులు రక్తదానం చేసారు.
అనంతరం అభిమానులంతా కలిసి బర్త్ డే కేక్ కట్ చేసి చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, రంగస్థలం చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. అలాగే 100 సార్లు రక్తం దానం చేసిన దాతలందరీకి బహుమతులు అందించారు.

మెగా ఫ్యామిలీలో సెంటిమెంట్
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, `మా కుటుంబంలో ఉన్న ప్రతీ యాక్టర్ పుట్టిన రోజుకి, అలాగే వాళ్ల కుటుంబంలో ఏ శుభసందర్భం వచ్చినా ఆభిమానులంతా ఆ ఎమోషన్ ను రక్తదానం రూపంలో చూపిస్తున్నారు. ఈ సెంటిమెంట్ ను మీలో ఉంచుకుని మాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడే ఉంటాం.

స్టార్ అవుతాడని అప్పుడే
హీరో కాకముందు రామ్ చరణ్ ఓ సారి బాంబేలో యాక్టింగ్ కోర్సు ట్రైనింగ్ కి వెళ్లాడు. ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ అవ్వాలనేమి లేదు. అలా కొంత మందే అవుతారు. కానీ కోర్స్ పూర్తిచేసి వచ్చిన తర్వాత మాకొక వీడియో చూపించాడు. అది చూసి అతను స్టార్ అవుతాడని ఆరోజే మేమంతా నిర్ణయానికి వచ్చేసాం.

మగధీర చేసే అవకాశం
రాంచరణ్‌తో రెండో సినిమా `మగధీర` చేసే అవకాశం నా కొచ్చింది. ఆ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మీ అందరికీ తెలుసు. రాజమౌళి గారు ఆ సినిమా చరణ్ తో చేసినందుకు, ఆ అవకాశం చిరంజీవి గారు నాకు ఇచ్చినందుకు ఇద్దరికీ ఈ సందర్భంగా ధన్యవాధాలు తెలుపుతున్నాను.

రంగస్థలం సెన్సేషనల్ హిట్
మగధీర తర్వాత రామ్ చరణ్‌కు చాలా హిట్లు వచ్చాయి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత చరణ్ తో `ధృవ` సినిమా చేశాం. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు `రంగస్థలం` తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాలన్నింటి కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు అని అన్నారు. నిర్మాత నవీన్ చాలా కాలం నుంచి స్నేహితులు. ఆయన చరణ్ తో మంచి సినిమా చేశారు. పెద్ద విజయం అందుకోబోతున్నారు. చివరిగా మరోసారి చరణ్ కు హ్యాపీ బర్త్ డే` అని అల్లు అరవింద్ అన్నారు.

చెర్రీ కెరీర్‌లోనే రంగస్థలం
రంగస్థలం నిర్మాత నవీన్ మాట్లాడుతూ, ` ముందుగా రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్ డే. రంగస్థలం సినిమా చాలా బాగా వచ్చింది. చాలా నమ్మకంగా ఉన్నాం. అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. `మగధీర` తర్వాత చెర్రీ కెరీర్ లో `రంగస్థలం` పెద్ద హిట్ అవుతుంది. ఇందులో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు. ఈనెల 30న అందరూ థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి` అని అన్నారు.

600పైగా మంది రక్తదానం
అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు మాట్లాడుతూ, ` మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 600 మంది అభిమానులు రక్తం దానం చేసారు. వాళ్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. 100 సార్లు రక్తదానం చేసిన వారందరికీ అవార్డులను కూడా అందిస్తున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించాం` అని అన్నారు.

చెర్రీ బర్త్ డే గ్రాండ్‌గా
కాగా, రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి నివాసంలో కలుసుకొన్నారు. ఆ సందర్భంగా వారి మధ్య వెల్లడైన అనుబంధం, ఆప్యాయతలు ఫోటోలో స్పష్టంగా కనిపించాయి. దాంతో కొన్ని రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.

అబ్బాయి కోసం బాబాయ్ పవన్
రాంచరణ్ పుట్టిన రోజున చిరంజీవి నివాసంలో వేడుకలు జరిగాయి. ఆ కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యాడు. ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ అందరూ లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాయ్ పవన్ కల్యాణ్ రావడంతో రాంచరణ్ ఆనందం మరింత రెట్టింపు అయిందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











