పవన్ చేతుల మీదుగా ‘రేయ్’ ఆడియో (ఫోటోలతో..)
హైదరాబాద్ : మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'రేయ్'. ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.
పవన్ కళ్యాణ్ ఆడియో సీడీలను విడుదల చేయగా...వైవిఎస్ చౌదరి కుమార్తె యుక్త తొలి సీడీని అందుకుంది. తొలి పాటను సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ విడుదల చేసారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్ లోకి విడుదల చేసారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో అలీ, నరేష్, చంద్రబోస్, జెమిని కిరణ్, రమేష్ ప్రసాద్, ప్రేమ్ రక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు, మరిన్ని వివరాలు....

పవన్ కళ్యాణ్‌కి రుణపడి ఉంటాను
దర్శకుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ...సాయి ధరమ్ తేజ్ కోసమని వెళితే కథ చెప్పమన్నారు. స్టోరీ విన్న వెంటనే నా మీద నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ ను నాకు హీరోగా అప్పగించినందుకు పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు.

నమ్మకమే నడిపించింది
‘ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం. అలాంటి కష్టాలు ఎదురైనపుడు పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకమే నన్ను నడిపించింది. సినిమా విషయానికొస్తే గెలుపు కోసం అరిచే ఒక అరుపే ఈ రేయ్' అన్నారు వైవిఎస్ చౌదరి.

సాయి ధరమ్ తేజ్ ఒక మిసైల్
సాయి ధరమ్ తేజ్ నాకు దొరికిన ఒక మిసైల్. చాలా హార్డ్ వర్క్ చేసాడు. సయామీ ఖేర్, శ్రద్ధా దాస్, ప్రతి ఒక టెక్నీషియన్‌కి ధన్యవాదాలు. ఈ రోజు హీరో చక్రి. మా కాంబినేషన్లో ఇదివరకు దేవదాస్ సినిమా హిట్టయింది. ఈ సినిమాలో సంగీతం డిఫరెంటుగా ఉంటుంది..అన్నారు వైవిఎస్.

కరేబియన్ కుర్రాడిలా..
సాయి ధరమ్ తేజ్ ద్రవిడియన్ పర్సనాలిటీతో కరేబియన్ కుర్రాడిలా ఉంటాడు. సినిమాలో సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా అందరికీ నచ్చుతుందనే పూర్తి నమ్మకం ఉంది అన్నారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..
‘పవన్ కళ్యాణ్ మామయ్య తన విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్. వైవిఎస్ చౌదరిగారు నాకు పెద్ద లాంచ్ ఇచ్చారు. చక్రిగారు అందించిన సంగీతం సినిమాకు ఆత్మ లాంటిది' అన్నారు.

ముగ్గురు మావయ్యల నుండి...
‘నేను చిరంజీవి గారి దగ్గర నుండి కృషి, పట్టుదల.... నాగబాబు నుండి సహనం, నవ్వును....పవన్ కళ్యాణ్ దగ్గర నుండి క్రమశిక్షణ, నిబద్దత నేర్చుకున్నాను' అని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.

చిరంజీవి అభిమానినే...
సినిమాల్లోకి రాకముందు చిరంజీవి గారి అభిమానిని, సినిమాల్లో పవన్ కళ్యాణ్ శిష్యుడిని, ఎప్పటికీ మీలో ఒకడిని...అని చెప్పకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.

చంద్రబోస్ మాట్లాడుతూ...
చిరంజీవిగారి దగ్గర నుండి ఇప్పటి చరణ్ వరకు మెగా ఫ్యామిలీకి ఎన్నో పాటలను రాసాను. ప్రేక్షకులు నన్నెంతో ఆదరించారు. ఇపుడు సాయి ధరమ్ తేజ్‌కి రాసాను. ఇక చౌదరిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాని వ్యక్తి. సాయి ధరమ్ తేజ్ భవిష్యత్‌లో ఇండస్ట్రీని ఏలుతాడు...అని చెప్పుకొచ్చారు.

లుంగీ బాబాగా అలీ
‘వైవిఎస్ చౌదరిగారు చాలా బాగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో నేను లుంగీ బాబాగా నటించాను' అని అలీ చెప్పుకొచ్చారు.

రేయ్
సాయి ధరమ్ తేజ్ మెగా కుటుంబానికి చెందిన హీరో కావడంతో ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తరచూ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు అదిరిపోయే విధంగా ఉండటం కూడా మరో కారణం. తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్లో సాయి ధరమ్ తేజ్ లుక్ డిఫరెంటుగా, టెర్రిఫిక్‌గా ఉండటం ఆకట్టుకుంటోంది.

విడుదల తేదీ
బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు. ఫిబ్రవరి 5న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications










