కళ తప్పిన పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ డీలా! (ఫోటోలు)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....సాధారణంగా ఏ పబ్లిక్ ఫంక్షన్‌కు, ఆడియో ఫంక్షన్‌కు హాజరైనా కాస్త సిగ్గు పడుతూ, నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. ఆయన మొహంలో ఆ నవ్వు చూస్తే చాలు ఫ్యాన్స్ చాలా ఆనంద పడిపోతారు. కానీ తన సోదరుడు నాగబాబు తనయుడైన వరుణ్ తేజ్ మూవీ ఓపెనింగు ఫంక్షన్‌కు హాజరైన పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించారు. పూర్తిగా సీరియస్ లుక్‌తో కనిపించారు.
ఆయన ఫేస్ ఫీలింగ్స్ నిశితంగా పరిశీలిస్తే....అన్నయ్య నాగబాబు బలవంతం మీద, ఇష్టం లేకున్నా కష్టంగా వచ్చినట్లు కనిపించారు. కనీసం వరుణ్ తేజ్‌ను విష్ చేసేప్పుడు కూడా ఆయన మొహంలో చిరు నవ్వు అనేది లేదు. మరి పవన్ ఎందుకిలా ఉన్నారు? అంటే మాధానం దొరకపట్టడం కష్టమే.
అందుకు సంబంధించిన ఫోటోలు, వరుణ్ తేజ్ సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

అర్చకుడిని వారిస్తున్న పవన్
వరుణ్ తేజ్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా అక్కడ ఉన్న అర్చకుడు పవన్ కళ్యాణ్‌కు బొట్టు పెట్టడానికి ప్రయత్నించగా....అదేమీ వద్దంటూ పవన్ కళ్యాణ్ వారిస్తున్న దృశ్యం.

కళ తప్పిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ బయట ఎప్పుడు, ఎక్కడ కనిపించినా చిరునవ్వు ముఖారవిందంతో కనిపిస్తారు. కానీ వరుణ్ తేజ్ సినిమా కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ ముఖం కళ తప్పి కనిపించింది.

మొక్కుబడిగా?
పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి అన్నయ్య నాగబాబు మాట కాదనలేక మొక్కుబడిగా హాజరైనట్లు స్పష్టమవుతోంది. ఈ కార్యక్రమానికి ఆయన ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు.

వరణ్ తేజ్ మనసులో ఏముంది?
ప్రియమైన బాబాయ్ అలా సీరియస్ లుక్‌తో ఉండటంతో వరుణ్ తేజ్ కూడా కాస్త డీలా అయినట్లు కనపించాడు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ స్పష్టంగా చూడచొచ్చు.

మీడియాలో విమర్శలు రాకూడదనే?
మెగాస్టార్ చిరంజీవి హాజరై, పవన్ కళ్యాణ్ హాజరు కాకుంటే మీడియాలో ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వార్తలకు తావివ్వకుండా, అన్నయ్య నాగబాబుపై గౌరవంతో పవన్ కల్యాణ్ హాజరైనట్లు స్పష్టమవుతోంది.

సినిమా వివరాలు...
వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈచిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెడ్గే హీరోయిన్. లియోఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











