twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘AD’ 100 డేస్: 101 కేజీల కేక్, అన్నదానం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అభిమానులు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా 70ఎంఎం థీయేటర్ వద్ద 100 రోజుల పండగను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. అదే విధంగా 101 కేజీల కేక్‌ను కట్ చేయనున్నారు.

    సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'మా అత్తారింటికి దారేది' దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అన్ని చోట్లా ఓవరాల్‌గా హయ్యెస్ట్ షేర్స్ కలెక్ట్ చేసింది. అంతటి అపూర్వ విజయాన్ని మాకు అందించిన మా హీరో పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఆల్ టైం హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.

    Attarintiki Daredi

    పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఇద్దరూ హీరోయిన్లు తమ నటన, అందచందాలతో ఆకట్టుకున్నారు.

    నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Pawan Kalyan's "Attarintiki Daredi" is successfully completing its 100-day theatrical run today (4 January) in record number of 32 screens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X