twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్కెట్లోకి ‘అత్తారింటికి దారేది’ టీ షర్టులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనాల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి స్పష్టం అయింది. పవర్ స్టార్ తాజాగా నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో...ఆయన సినిమాలో ధరించిన టీషర్టు డిజైన్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ టీషర్టులు హాట్ కేకుల్లా అమ్మడవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

    సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆందోళన కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యామిలీ సినిమాలను సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో విడుదల నిలిచి పోయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని సెప్టెంబర్ చివరలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న గానీ, సెప్టెంబర్ 27న కానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

    ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Power Star Pawan Kalyan's Attarintiki Dareedi T-shirts which are available in different colors of choice. People started following the trend before the movie is released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X