అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై.. ఎప్పుడు ? ఎక్కడో తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. నా పేరు సూర్య సక్సెస్ మీట్ రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనబోతున్నాడు.
స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

నా పేరు సూర్య సక్సెస్ మీట్ రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటు చితంలో నటించిన నటినటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.
నా పేరు సూర్య సినిమాను రూ.60 కోట్ల వ్యయంతో తెరకెక్కించడం జరిగింది. హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.24 కోట్లు వచ్చాయని సమాచారం. సైనికుడిగా బన్నీ చక్కటి నటన కనబర్చడం, సైనికుడి పాత్ర అందరికి నచ్చడం యూత్, మాస్‌ను ఆకట్టుకునేలా యాక్షన్ సీన్లు ఉండటంతో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











