అఫీషియల్ : పవన్ కళ్యాణ్ గెస్ట్ గా....

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'రేయ్'. సయామీఖేర్ హీరోయిన్ . వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈ నెల 5న విడుదల చేయనున్నారు. పాటల వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''మా చిత్రానికి పవన్‌కల్యాణ్ అందిస్తున్న ప్రోత్సాహం మర్చిపోలేనిది. 'రేయ్' పాటల వేడుకకు ఆయన రాబోతుండడం... ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నెల 4న ఏ టూ జెడ్ లుక్‌ని విడుదల చేస్తున్నాం. 11న ట్రైలర్‌ని చూపిస్తాం. ఫిబ్రవరి 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. బొమ్మరిల్లు పతాకంపై వచ్చిన సినిమాలోని పాటలన్నీ శ్రోతలను బాగా ఆకట్టుకొన్నాయి. 'రేయ్' పాటలూ అదే స్థాయిలో ఉంటాయి. చక్రి సమకూర్చిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం చక్కగా కుదిరాయి'' అన్నారు.


Click it and Unblock the Notifications











