ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'గబ్బర్ సింగ్' సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. సినిమా విడుదలైన ఘన విజయం సాధించిన తర్వాత తొలి సారి ఆయన పబ్లిక్‌లోకి వచ్చి అభిమానులతో ఆనందాన్ని పంచుకోబోతున్నారు. ఈ చిత్రం ఆడియో భారీ విజయం సాధించిన నేపథ్యంలో రేపు(మే 31) జరుగబోయే గబ్బర్ సింగ్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌కి హాజరు కాబోతున్నారు.
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులతో పాటు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. పవర్ స్టార్ ఈ వేడుకకు హైలెట్‌గా నిలబోతున్నారు.
సాధారణంగా తన సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. గబ్బర్ సింగ్ ప్రమెషన్ విషయంలోనూ పవర్ స్టార్ దూరంగానే ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతి హాసన్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు.
తాజాగా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం. పవర్ స్టార్ రాక విషయం తెలుసుకున్న అభిమానులు రేపు భారీ ఎత్తున ఈ వేడుకకు హాజరయ్యేందుకు సిద్దం అవుతున్నారు.
గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











